అయితే మీరెప్పుడైనా గమనించారా? పాకెట్‌లో చిప్స్ చాలా వరకు జిగ్ జాగ్ గీతలతో వస్తున్నాయి. ఒక్కో కంపెనీ నాలుగైదు వెరైటీల్ని అందిస్తున్నాయి. అసలు గీతలతో చిప్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రత్యేకించి ఏదైనా కారణముందా? ఆలూ చిప్స్‌ను చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఇష్టంగా తింటుంటారు. చిప్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో కొన్ని సార్లు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనేక వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఎటాక్ చేస్తాయట. దాంతో వ్యాధుల ముప్పు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఆలూ చిప్స్ అధికంగా తీసుకోకూడదు. మితంగా తినాలి అంటుంటారు. అధికంగా తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే వీటి తయారీలో నూనె, ఉప్పు అధికంగా యూజ్ చేస్తుంటారు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది బాడీలో చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆలూ చిప్స్‌లో ఉండే అక్రిలమైడ్ అనే రసాయనం క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందట. అలాగే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ ఫ్రై చేసిన చిప్స్ వంటి స్నాక్స్ జోలికి వెళ్లకూడదట. ఎందుకంటే.. ఇలాంటి ఆహారం వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రతన్ టాటా ఆస్తిలో శాంతను నాయుడుకీ వాటా ??
జియో దీపావళి రీఛార్జ్.. నవంబర్ 3లోపు రీఛార్జి చేసుకున్నవారికి ₹3,350 బెనిఫిట్స్
పరువు పోతుందనే సైలెంట్‌గా ఉంటున్నారా ?? కంప్లైంట్ అందుకే ఇవ్వడం లేదా ??
బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త
Amaran: శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??