NagaBandham: నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..

|

Jul 17, 2024 | 11:51 AM

మొన్నటి వరకూ అనంత పద్మనాభుడి ఖజానా, నేలమాళిగలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందన్న ప్రచారంజరిగింది. నేలమాళిగల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు. ఇతర గదుల్లోకి వెళ్లడానికి ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది. ఇప్పుడు పూరీజగన్నాథుడి ఆలయంలో నేలమాళిగలో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్న ఆలయ అధికారులు.. వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లు చేశారు.

మొన్నటి వరకూ అనంత పద్మనాభుడి ఖజానా, నేలమాళిగలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందన్న ప్రచారంజరిగింది. నేలమాళిగల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు. ఇతర గదుల్లోకి వెళ్లడానికి ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది. ఇప్పుడు పూరీజగన్నాథుడి ఆలయంలో నేలమాళిగలో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్న ఆలయ అధికారులు.. వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లు చేశారు. జూలై 14 మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాలకు తలుపులు తెరవాలని ముహూర్తం పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకు? దీనికేమైనా విశేషం ఉందా? లేక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అవుననే అంటున్నారు పండితులు. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో మాదిరిగానే జగన్నాథుడి రత్న భాండాగారానికి కూడా నాగబంధనం వేసి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ నాగబంధనం అంటే ఏమిటి? ఎందుకు వేస్తారు?

పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వెయ్యడంలో ప్రసిద్ధులు. అయితే ఈ బంధనం వెయ్యడం అంత సామాన్య విషయం కాదు. తాంత్రిక విద్యలలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే వీటిని ఒక పద్ధతిలో వేసేవారు. ఇలా వేసిన నాగబంధనం విప్పాలంటే అలాంటి తాంత్రిక శక్తులు కలిగి ఉన్న సిద్ధపురుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ నాగ బంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమయిన నాగులను ఆవాహనం చేసుకుని మంత్రశక్తితో బంధనంగా చేస్తారు. ఏదయినా గదికి కాని లేదా సంపదకు కాని వాటిని కాపలాగా ఉంచుతారు. ఒకసారి నాగబంధం వేస్తే, అవి కొన్ని వేల సంవస్చారాల వరకు వాటిని కాపాడుతాయని, మరలా వాటిని తీయాలి అంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని ప్రయోగించాలి. అలా కాదని వాటిని ఇతర మార్గాల్లో తెరవాలని చూస్తే విపత్తును కొని తెచ్చుకున్నట్టేనని చెబుతారు. ఇక ఈ గరుడ మంత్రం తెలిసినవారు పరమ నిష్టా గరిష్టులు అయ్యి ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా వినాశనానికి దారితీస్తుంది అని ప్రాచీన గ్రంధాల ఆధారంగా తెలుస్తోంది.

ఒకవేళ నిజంగానే ప్రయత్నించినా అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కులలో ఒక్కొక దిక్కుకూ ఒక్కొక నాగ దేవత కాపలా కాస్తుంది అని అంటారు. అయితే నాగబంధం వేసిన చోట ఏ నాగ దేవత ఉందో, ఆ నాగబంధనానికి ఏ రకమయిన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కాని ఆ నాగబంధనాన్ని విప్పడం సాధ్యం కాదు. నాగబంధనం విప్పడానికి ఖచ్చితంగా గరుడమంత్రం తెలిసి ఉండాలి. నాగబంధనానికి విరుగుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో, అదే విధంగా నాగబంధానికి ఏ రకమయిన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెబుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 16, 2024 06:23 PM