బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది

Updated on: Jan 15, 2026 | 3:25 PM

ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తాజాగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీ 'బేబీ అరిహా' అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. దాదాపు నాలుగేళ్లుగా జర్మనీలో ఫోస్టర్ కేర్ సంరక్షణలో పెరుగుతున్న భారతీయ చిన్నారి అరిహాను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని లేదా భారత్‌కు పంపించాలని మోదీ కోరారు.

ఏడు నెలల పసికందుగా ఉన్న అరిహా తల్లి పాలు తాగుతూ తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తుండగా సడన్‌గా తల్లి చేతులనుంచి పసిపాపను వేరు చేసి, ఒక ప్రభుత్వ foster homeలో ఉంచితే ఎలా ఉంటుంది ? కన్న తల్లి చూడటానికి కూడా వీలు లేకుండా చేస్తే.. ఆ తల్లి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆలోచించారా ? అరిహా షా గుజరాత్‌కు చెందిన ధారా, భావేష్ షా దంపతుల కుమార్తె. వీరు పని నిమిత్తం జర్మనీలోని బెర్లిన్‌లో ఉండేవారు. 2021 సెప్టెంబర్‌లో, అరిహా ఏడు నెలల పాపగా ఉన్నప్పుడు, ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గాయపడింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే, అక్కడి వైద్యులు తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేశారు. పాపను హింసిస్తున్నారనే ఆరోపణతో జర్మన్ అధికారులు అరిహాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత జరిగిన పోలీసు విచారణలో తల్లిదండ్రులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలింది. వారిపై ఉన్న కేసులన్నీ 2022లో కొట్టివేశారు. అయినా కూడా జర్మన్ అధికారులు పాపను తల్లిదండ్రులకు అప్పగించకుండా ఫోస్టర్ కేర్ లోనే ఉంచారు.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ