జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!

Updated on: Jun 28, 2026 | 6:21 PM

నెలకు లక్ష రూపాయల జీతం వచ్చినా చాలామందికి పొదుపు చేయడం కష్టంగా మారుతోంది. పెరుగుతున్న జీవన వ్యయం, లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల వినియోగం ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. నిపుణులు జీతం వచ్చిన వెంటనే '50-30-20' సూత్రం ప్రకారం ముందుగా పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసర నిధిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒకప్పుడు నెలకు ఆరంకెల జీతం సంపాదించడాన్ని ఆర్థిక భద్రతకు గ్యారంటీగా భావించేవారు. కానీ నేడు చాలామందికి లక్ష రూపాయల జీతం వస్తున్నా నెల చివరికి రూపాయి కూడా మిగలట్లేదు. ఆదాయం పెరిగినంత వేగంతోనే ఖర్చులు కూడా పెరుగుతుండటంతో ప్రతీ నెలా చేతికి వచ్చిన జీతం వచ్చినట్లే ఖర్చయిపోయే ఓ వలయంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు చిక్కుకుపోతున్నాయి. జీతం పెరగ్గానే చాలామంది తమ లైఫ్‌స్టైల్ మార్చేస్తున్నారు. పెద్ద ఇళ్లు, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనాలు, ప్రీమియం గ్యాడ్జెట్లు, విహారయాత్రలు వంటివి అలవాటు చేసుకుంటున్నారు. మొదట్లో కష్టపడి పనిచేసినందుకు రివార్డుగా భావించేవారు. క్రమంగా రోజువారీ అలవాట్లుగా మారిపోయి పొదుపును దెబ్బతీస్తున్నాయి. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఫిక్స్‌డ్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటి అద్దె కోసమే రూ. 20,000 నుంచి రూ. 40,000 ఖర్చవుతోంది. దీనికి తోడు పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువులు, ఈఎంఐలు బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు ఈజీగా లభిస్తుండటంతో తాము కొనలేని వస్తువులను కూడా ఈఎంఐలలో కొనేస్తున్నారు. అప్పు తీసుకునే సామర్థ్యం గొప్పదన్నట్లుగా తప్పుగా ఊహించుకుంటున్నారు. దాంతో వడ్డీలు కట్టడానికే ఎక్కువ డబ్బు సరిపోతోంది. చాలామంది పెట్టుబడులను ‘తర్వాత చూద్దాం’ అని వాయిదా వేస్తుంటారు. అలాగే లగ్జరీ కార్ల వంటి తరుగుదల ఉండే ఆస్తులను పెట్టుబడిగా భావిస్తున్నారు. వీటికి తోడు సోషల్ మీడియాలో ఇతరుల లైఫ్‌స్టైల్‌తో పోల్చుకుని చూసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, అనవసరమైన ఖర్చులకు దారితీస్తోంది. చాలా కుటుంబాలు కేవలం ఒకరి సంపాదన మీదే ఆధారపడటం కూడా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోంది. భారతదేశంలో పొదుపు రేటు జీడీపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు పొదుపు సూత్రం చెబుతున్నారు. జీతం రాగానే ముందుగా ఖర్చుల కోసం పెట్టుకుని ఆ తర్వాత మిగిలింది దాచుకోవడం మంచిది కాదు. అలా కాకుండా.. జీతం పడగానే ’50-30-20′ నిబంధన ప్రకారం కనీసం 20 శాతం ముందే పొదుపు లేదా ఇన్వెస్ట్‌మెంట్‌కు కేటాయించాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు వల్ల మాత్రమే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RAAKA: ‘రాకా’ తో హాలీవుడ్‌తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ!

ఔను.. ముగ్గురితో నాకు ఎఫైర్ ఉంది ! ఒప్పుకున్న బిల్ గేట్స్‌

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!

Follow Us