Viral Video: నల్ల గేదెకు తెల్ల దూడ.. ఎక్కడో తెలుసా..? ఇలా ఎలా అంటూ వింతగా చూస్తున్న స్థానికులు..(వీడియో)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లా లో ఓ గేదెకు తెల్లటి దూడ జన్మించటం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది.

Viral Video: నల్ల గేదెకు తెల్ల దూడ.. ఎక్కడో తెలుసా..? ఇలా ఎలా అంటూ వింతగా చూస్తున్న స్థానికులు..(వీడియో)

|

Updated on: Dec 18, 2021 | 9:24 AM


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లా లో ఓ గేదెకు తెల్లటి దూడ జన్మించటం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. కుభీర్ మండలం “పార్డి – కె ‘ గ్రామానికి చెందిన శాహేన్ రెడ్డి అనే రైతుకు చెందిన గేదె… మూడ్రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఆ గేదె దూడ తెల్లగా పుట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. చూడటానికి అచ్చం లేగ దూడలా ఉండటంతో …. గేదెకు ఆవు దూడ పుట్టిందా … అనిపిస్తోంది.మొదట దీనిని చూసిన వారంతా ఆవు దూడను గేదె దగ్గర ఎందుకు కట్టేశారు అనుకున్నారట.. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అసలు విషయం తెలియడంతో గ్రామస్తులు షాక్ అయ్యారట.. నలుపు రంగు గేదె వద్ద తెల్ల రంగులో పాల వలే మెరిసిపోతున్న దూడ పాలు తాగుతూ కనిపిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని, రానురాను రంగు తగ్గుతూ వస్తుందని కొందరు రైతులు చెబుతున్నారు. జన్యు లోపం కారణంగానే అరుదుగా గేదెలకు తెల్ల దూడలు పుడతాయని పశు వైద్యులు చెబుతున్నారు.

Follow us