ఏసీ కోచ్‌లో తగ్గిన కూలింగ్ ..ఏంటా అని చూడగా షాక్ వీడియో
రైలులోని ఏసీ కోచ్‌లో కూలింగ్ లేదని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది, టెక్నీషియన్ వచ్చి ఏసీ క్యాబిన్లను చెక్ చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో క్యాబిన్లలో కనిపించినవి చూసి ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఆగస్ట్ 13న లక్నో-బరౌని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని సెకండ్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో విపిన్ కుమార్ ప్రయాణించాడు. అతడు రిజర్వ్ చేసుకున్న సీటు వద్ద చల్లదనం లేకపోవడంపై రైల్వేకు ఫిర్యాదు చేశాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది, ఏసీ టెక్నీషియన్ కలిసి ఆ కోచ్‌ను తనిఖీ చేశారు. అందులోని ఏసీ క్యాబిన్లను టెక్నీషియన్ పరిశీలించాడు. వాటిలో పేపర్ ప్యాకెట్లు దాచి ఉండటాన్ని గమనించాడు. ఏమిటా అని.. ఆ కోచ్‌లోని అన్ని ఏసీ క్యాబిన్లలో దాచిన ఆ ప్యాకెట్లను బయటకు తీశాడు. పేపర్ ప్యాకెట్లు తెరిచి చూడగా 150కి పైగా లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. మద్యంపై నిషేధం ఉన్న బీహార్‌కు వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కోచ్‌లోని ఏసీ క్యాబిన్ల నుంచి లిక్కర్ బాటిల్స్ ప్యాకెట్లు బయటకు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :