Which is first chicken or egg: కోడి ముందా.. గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌…!అమెరికన్‌ సైంటిస్టుల వివరణ.. (వైరల్ వీడియో)

|

Nov 07, 2021 | 3:06 PM

ప్ర‌పంచాన్ని ఎప్ప‌టి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఇది..కానీ, ఇంతవరకు దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎవరైనా సరదాగా ప్రశ్నించి... అవతలి వారిని ఓడించడానికి అడిగే సమాధానం లేని ప్రశ్న కూడా ఇదే..అయితే దీనికి ఇప్పుడు స‌మాధానం దొరికింది...

ప్ర‌పంచాన్ని ఎప్ప‌టి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఇది..కానీ, ఇంతవరకు దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎవరైనా సరదాగా ప్రశ్నించి… అవతలి వారిని ఓడించడానికి అడిగే సమాధానం లేని ప్రశ్న కూడా ఇదే..అయితే దీనికి ఇప్పుడు స‌మాధానం దొరికింది. అవునండోయ్…మీరు విన్న‌ది నిజమే…. నిజానికి ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ క‌నిపెట్టేందుకు ఏళ్ల తరబడి సైంటిస్టులు, మేథావులు ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం లేదు. కానీ ఇంత‌టి క‌ఠిన మైన ప్ర‌శ్న‌కు అమెరికా సైంటింస్టులు ఆన్స‌ర్ దొర‌క‌బ‌ట్టారు. ఇందుకు సంబంధించి ఓ పెద్ద క‌థే ఉందంటున్నారు…అదేంటో మీరూ ఓ లుక్కేయండి..

అమెరికాలో నివ‌సించే రాబర్ట్ క్రుల్విచ్ వృత్తి రీత్యా జర్నలిస్ట్ గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న ఇటీవ‌ల సైంటిస్టులు వివ‌రించిన దాన్ని ఓ థియ‌రీ రూపంలో రాసుకొచ్చారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం భూమిమీద కోళ్లు అనేవి లేవ‌ని, కానీ పరిణామ క్రమంలో అవి అవ‌త‌రించాయ‌ని చెప్పారు. మ‌నుషులు పుట్ట‌క ముందు ఈ భూమ్మీద కోళ్లలాగే ఉండే కొన్ని పెద్ద పక్షులు వేల ఏళ్ల క్రితం ఉండేవట…ఇవి చూడ‌టానికి అచ్చం కోళ్లను పోలినట్లుగా ఉండేవ‌ని, ఆ పక్షులు పెట్టిన గుడ్డు నుంచే కోడి వ‌చ్చంద‌ని చెప్పేశారు..ఆ భారీ ప‌క్షిని ప్రోటో కోడిగా చెబుతున్నారు.

ఈ ప్రోటో కోళ్లు కాల క్ర‌మేణా సైజు త‌గ్గిపోవ‌డంతో అవి పెట్టే గుడ్ల నుంచి జన్యుపరమైన మార్పుల‌తో చాలా ఏండ్ల త‌ర్వాత చివ‌ర‌కు కోడి జాతి పుట్టుకొచ్చిన‌ట్టు వివరించారు. ఇప్పుడున్న కోడి అప్ప‌టి నుంచే వ‌చ్చింద‌ని ఆ ప్రోటో కోడి కార‌ణంగానే ఇప్ప‌టి కోడి పుట్టుకొచ్చిన‌ట్టు వివ‌రించారు. సో ఈ వివరణను చూసుకుంటే గుడ్డు ముందు అని తేల్చారు. అందుకు సంబంధించిన థియరీని ప్రచురించారు. కాగా, అమెరికన్‌ సైంటిస్టుల వివరణకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ వివరణతో అందరూ ఏకీభవించడం లేదు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Published on: Nov 07, 2021 03:05 PM