Indira Gandhi – Rakesh Sharma: నాడు అంతరిక్షం నుంచి ఇందిరాగాంధీతో మాట్లాడిన రాకేష్‌ శర్మ..!

|

Feb 29, 2024 | 4:57 PM

గగన్‌యాన్‌లో భాగంగా స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను తాజాగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నలుగురు ఘనత సాధించనున్నప్పటికీ... తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయుడు మాత్రం రాకేశ్‌శర్మ. ఎయిర్‌ఫోర్స్‌ మాజీ పైలట్‌ రాకేశ్‌ శర్మ.. ఏప్రిల్‌ 3, 1984న సోవియట్‌ వ్యోమనౌక సూయజ్‌ టీ-11లో అంతరిక్షయానం చేశారు.

గగన్‌యాన్‌లో భాగంగా స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను తాజాగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నలుగురు ఘనత సాధించనున్నప్పటికీ… తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయుడు మాత్రం రాకేశ్‌శర్మ. ఎయిర్‌ఫోర్స్‌ మాజీ పైలట్‌ రాకేశ్‌ శర్మ.. ఏప్రిల్‌ 3, 1984న సోవియట్‌ వ్యోమనౌక సూయజ్‌ టీ-11లో అంతరిక్షయానం చేశారు. సెల్యూట్‌ 7 స్పేస్‌ స్టేషన్‌లో భూమి చుట్టూ తిరుగుతూ దాదాపు ఎనిమిది రోజులు గడిపారు. ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో అంతరిక్షం నుంచే మాట్లాడే అవకాశం వచ్చింది. స్పేస్‌ నుంచి భారత్‌ ఎలా కనిపించింది? అని ఇందిరా అడిగిన ప్రశ్నకు.. ‘సారే జహా సే అచ్ఛా’ అంటూ రాకేశ్‌ ఇచ్చిన సమాధానం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. భారరహిత స్థితిలో అనుభూతి గురించి రాకేశ్‌ను అడగగా.. సిమ్యులేటర్‌లో ఉన్నట్లే అనిపించిందని, కఠోర శిక్షణ వల్లే అది సాధ్యమైందని చెప్పారు.

బయో మెడిసిన్‌, రిమోట్‌ సెన్సింగ్‌లను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఆ మిషన్‌.. భారత్‌ చేసిన అనేక ప్రయోగాల్లో సాంకేతిక అధ్యయనానికి దోహదపడింది. భారత్‌-సోవియట్‌లు సంయుక్తంగా చేపట్టిన ఆ మిషన్‌ దేశ అంతరిక్ష పరిశోధనలకూ ఎంతో ఊతమిచ్చింది. మళ్లీ సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం స్వదేశీ వ్యోమనౌకలో నలుగురు భారతీయులను అంతరిక్షంలో పంపించేందుకు ‘గగన్‌యాన్‌’ సిద్ధమవుతోంది. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లాలు వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ పట్ల యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించి నలుగురు వ్యోమగాములకు కఠోర శిక్షణ కొనసాగుతోంది. తాజాగా వీరి పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..