ఏటీఎం కార్డ్‌ కాదు..పెళ్లికార్డు… వివరాలు కోసం స్కాన్‌ చేయాల్సిందే..

|

Aug 29, 2023 | 8:30 PM

ఇటీవల కాలంలో వివాహాది కార్యక్రమాల్లో చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని, నూరేళ్లూ అందరికీ గుర్తుండిపోవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లిలో పెళ్లిపత్రికలు ప్రధానమైనవి. దీంతోనే పెళ్లిపనులు మొదలు పెడతారు. తాజాగా ఓ పెళ్లికొడుకు తమ పెళ్లి పత్రికను వినూత్నంగా వేయించాడు. దీంతో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు.

ఇటీవల కాలంలో వివాహాది కార్యక్రమాల్లో చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని, నూరేళ్లూ అందరికీ గుర్తుండిపోవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లిలో పెళ్లిపత్రికలు ప్రధానమైనవి. దీంతోనే పెళ్లిపనులు మొదలు పెడతారు. తాజాగా ఓ పెళ్లికొడుకు తమ పెళ్లి పత్రికను వినూత్నంగా వేయించాడు. దీంతో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. తన పెళ్లి పత్రికను ఓ క్యూఆర్‌ కోడ్‌ కార్డులా తయారుచేయించాడు. పెళ్లి తేదీ, ముహూర్త సమయం, వేదిక, తదితర వివరాలన్నీ తెలుసుకోవాలంటే కార్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను మీ మొబైల్‌ ఫోన్‌తో స్కాన్ చేయాలి. అప్పుడు కార్డ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో వధూవరుల వివరాలతోపాటు, ఆహ్వానితులు కూడా ఉంటారు. ఈ పెళ్లి పత్రిక ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో వైరల్ గా మారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన చిర్ల కృష్ణా రెడ్డి ,శిరీషల వివాహం సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌పై సింహం షికార్లు !! ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ !!

పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష

హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!

లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్‌ !!

 

Follow us on