Water scarcity: బకెట్ నీళ్ల కోసం మండుటెండలో మైళ్లదూరం.. అవి కాపాడుకోడానికి మినీ యుద్ధమే..
మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బకెట్ నీళ్ల కోసం మండుటెండలో మహిళలు మైళ్లదూరం ప్రయాణిస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు చెమటోడుస్తున్నారు. చుక్క నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బకెట్ నీళ్ల కోసం మండుటెండలో మహిళలు మైళ్లదూరం ప్రయాణిస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు చెమటోడుస్తున్నారు. చుక్క నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని అమరావతి జిల్లాలో మేల్‌ఘాట్ పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడి గిరిజనులు నీళ్ల కోసం ప్రాణాలకే తెగిస్తున్నారు. జిల్లాలోని ఖాదియాల్ గ్రామంలో కేవలం రెండు బావులు మాత్రమే ఉండటంతో అందరూ నీటికోసం వీటిపైనే ఆధారపడటంతో నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు ప్రజలు. ఆ బావుల్లో నీటి తోడేందుకు జనం ఎగబడుతున్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని కూడా ముందుగా బావిలోకి వదిలి.. తర్వాత ఆ నీటిని అక్కడి జనం బకెట్లు, బిందెలతో తోడుకుంటున్నారు. బావి నుంచి తోడే క్రమంలో నీళ్లు మురికి మురికిగా అయిపోతున్నాయని, అవి తాగడం వల్ల ప్రజలు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
