Water Dogs : ఉప్పలపాడులో అనుకోని అతిథులు… చెరువులో సందడి చేస్తున్న నీటి కుక్కలు.. ( వీడియో )

|

Jun 20, 2021 | 11:48 AM

ఇప్పటివరకూ అదొక పక్షుల సంరక్షణ కేంద్రం. ఎక్కడి నుంచి వచ్చాయో.. అనుకోని అతిథులు ఆటలు మొదలుపెట్టాయి. చెరువులో చేపలను భోంచేస్తూ అక్కడే మకాం వేశాయి...

ఇప్పటివరకూ అదొక పక్షుల సంరక్షణ కేంద్రం. ఎక్కడి నుంచి వచ్చాయో.. అనుకోని అతిథులు ఆటలు మొదలుపెట్టాయి. చెరువులో చేపలను భోంచేస్తూ అక్కడే మకాం వేశాయి. అరుదైన జాతికి చెందిన ఆ ప్రాణులు సందర్శకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నాయి. ఉప్పలపాడులోని పక్షుల సంరక్షణ కేంద్రానికి సరికొత్త ఆకర్షణగా మారిన నీటి కుక్కలపై ప్రత్యేక కథనం. ఏపీలోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఎక్కడినుంచో వచ్చి చేరిన నీటికుక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి చెరువులో ఉండే చెట్లపై విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకొని వెళ్తుంటాయి. ఓరోజు హఠాత్తుగా చెరువులో నీటి కుక్కలు కనిపించటం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన అడపాదడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Helmet: మెదడును చదివే హెల్మెట్‌ వచ్చేసింది.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ.. ( వీడియో )

Massive Spider Web: అవి తెరలా.. సాలీడు గూళ్ళ.. చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే.. ( వీడియో )

Follow us on