వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. ఐడియా అదుర్స్‌..!

Updated on: Jun 08, 2025 | 1:07 PM

మనిషి అవసరాల్లోనుంచే ఐడియాలు పుడతాయి. ఇటాంటి ఐడియాలకు పెట్టింది పేరు భారతీయులు. పనికిరాని వస్తువులను కూడా తమకు అనుగుణంగా మార్చుకోగల నైపుణ్యం భారతీయుల సొంతం. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఓ వ్యక్తి టేబుల్‌ ఫ్యాన్‌ను ఏసీగా మార్చేశాడు.. తాజాగా అలాంటి సూపర్‌ ఐడియా నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఓ మహిళ తన అద్భుతమైన ఐడియాతో కరెంట్‌ పోయిన సమయంలో ఇల్లంతా వెలుగు నింపేసింది. వేసవిలో కరెంట్‌ కోతలు సహజం. కరెంట్‌ ఏ సమయంలో పోతుందో చెప్పలేం. వంటచేసేటప్పుడు పోవచ్చు.. అర్ధరాత్రి వేళ పోవచ్చు. కరెంట్‌ ఎప్పుడు పోయినా ఇబ్బందే. అలా తను మంచి పనిలో ఉండగా ఇంట్లో కరెంట్‌ పోవడంతో ఆ మహిళ సెల్‌ ఫోన్‌ లైట్‌ ఆన్‌ చేసి పని చేసుకుంటోంది. అయితే ఆ వెలుగు సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతోంది. ఇంతలో ఆ మహిళకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే వెళ్లి ఓ వాటర్‌ బాటిల్‌లో నీళ్లు నింపుకొని వచ్చింది. ఆ బాటిల్‌ను తన సెల్‌ఫోన్‌ ప్లాష్ లైట్ మీద పెట్టింది. అంతే.. ఆ వాటర్‌బాటిల్ నుంచి వస్తున్న వెలుతురు ఆ గది అంతా పరుచుకుంది. ఈ టెక్నిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించారు. రెండున్నర లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. దీనిపై వివిధరకాలుగా స్పందించారు. ఐడియా బాగుందని కొందరు కామెంట్‌ చేస్తే… కరెంట్ వచ్చే వరకు ఫోన్‌ను వాడకుండా ఉండే వాళ్లెవరు అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామిడి పండ్లను రాత్రిపూట తింటున్నారా.. జాగ్రత్త..!

ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం.. పై నుంచి చూస్తే ఇదో పెద్ద నగరం!

ఈ ఒక్కదానితో మసాజ్‌ చేస్తే.. చర్మం యవ్వనంగా మెరుస్తుంది

ఈ మొక్క సర్వరోగ నివారిణి..ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

మీరు నల్లని పాలు ఎప్పుడైనా తాగారా? పోనీ చూశారా?