వీరేం దొంగలు బాబోయ్‌ !! ఒక్క రాత్రిలో మాయం చేశారు !!

|

Sep 08, 2023 | 9:56 AM

దొంగల బీభత్సం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చేతికి అందిందల్లా దోచుకుపోతుంటారు. ఇక నార్త్ దొంగల పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రికి రాత్రి రైలు పట్టాలు, సెల్‌ టవర్లు ఎత్తుకెళ్లిన ఘనులు ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. భారత జావెలిన్ త్రో స్టార్‌ నీరజ్ చోప్రా దేశానికి ఎంత కీర్తి తెచ్చిపెట్టాడో అందరికీ తెలిసిందే. ఒలంపిక్స్, అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు.

దొంగల బీభత్సం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చేతికి అందిందల్లా దోచుకుపోతుంటారు. ఇక నార్త్ దొంగల పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రికి రాత్రి రైలు పట్టాలు, సెల్‌ టవర్లు ఎత్తుకెళ్లిన ఘనులు ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. భారత జావెలిన్ త్రో స్టార్‌ నీరజ్ చోప్రా దేశానికి ఎంత కీర్తి తెచ్చిపెట్టాడో అందరికీ తెలిసిందే. ఒలంపిక్స్, అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. ఆయన కీర్తికి, సాధించిన విజయాలకు గుర్తుగా నీరజ్ ను గౌరవిస్తూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఓ ఆలోచన చేసింది. మీరట్ లోని హాపూర్ అడ్డాలో మీరట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నీరజ్ చోప్రా విగ్రహాన్ని ఆవిష్కరించారు. జావలిన్ విసురుతున్నట్లు ఉన్న నీరజ్ విగ్రహానికి నిజమైన ఈటెను అమర్చారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి నీరజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం రాత్రి కొందరు దొంగలు విగ్రహం చేతిలో ఉన్న ఈటెను ఎత్తుకెళ్లారు. అది గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!

పెళ్లి కావాలని పూజ‌లు.. విసుగెత్తి శివ‌లింగాన్నే ఎత్తుకెళ్లాడు

శాడిస్ట్‌ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు

Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..

మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని

 

Follow us on