Zakir Hussain: జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో ఇంత ఫేం..

|

Dec 18, 2024 | 6:22 PM

తబలా విద్వాంసుడు జాకిర్‌ హుస్సేన్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎక్స్‌ వేదికగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చాలామందికి జాకీర్‌ హుస్సేన్‌ అనగానే చటుక్కున గుర్తుకొచ్చే మరో పదం ‘వాహ్‌ తాజ్‌’. అదే 1990ల్లో ఆయన నటించిన తాజ్‌మహల్‌ టీ ప్రకటన. అసలీ యాడ్‌ వెనక ఓ ఆసక్తికర స్టోరీ ఉండటం విశేషం.

జాకీర్‌ హుస్సేన్‌ తబలా ప్రదర్శనను చూసే వీక్షకులంతా ‘వాహ్‌ ఉస్తాద్‌’ అంటూ కొనియాడేవారు. దీన్ని ఆధారంగా చేసుకొనే హిందుస్థాన్‌ థాంప్సన్ ‘తాజ్ మహల్‌ టీ’ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ముందు జాకిర్‌ హుస్సేన్‌ కూర్చుని తబలా వాయిస్తుంటారు. అప్పుడే ఈ టీని కూడా ఉత్తమంగా అందించేందుకు ఎన్నో రకాల నాణ్యతా పరీక్షలు చేశాం – అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్‌ వినిపిస్తుంటుంది. వీడియోలో చివరగా ఆయన బదులిస్తూ ‘వాహ్‌ ఉస్తాద్‌ కాదు.. వాహ్‌ తాజ్‌ అనండి’ అని అంటారు. ఈ యాడ్‌ అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేకమే.! దీని ప్రచారం కోసం జాకిర్‌ హుస్సేన్‌ను అనుకోలేదట. అయితే అప్పట్లో కేఎస్‌ చక్రవర్తి అనే వ్యక్తి హిందుస్థాన్‌ థాంప్సన్‌ అసోసియేట్స్‌లో కాపీరైటర్‌గా పని చేసేవారు. ఆయనకు తబలా అంటే చాలా ఇష్టం. ఓసారి జాకిర్‌ హుస్సేన్‌ ప్రదర్శనను చూస్తుంటే.. తమ టీ యాడ్‌కు ఆయన సరిగ్గా సరిపోతారని అనిపించిందట. అదే విషయాన్ని యాజమాన్యానికి చెప్పగా వారు జాకిర్‌ను సంప్రదించారు. ఈ యాడ్‌ కాన్సెప్ట్‌ ఆయనకూ నచ్చడంతో సొంత ఖర్చులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆగ్రాకు వచ్చినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.

ఈ ప్రకటనలో నటించడం గురించి గతంలో జాకిర్‌ హుస్సేన్‌ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తన పేరు వినగానే ‘వాహ్‌ తాజ్‌’ అని చాలామంది చెబుతారనీ సాధారణంగా బాలీవుడ్‌ మ్యూజిక్‌తో పోలిస్తే శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కాస్త తక్కువే. శాస్త్రీయ కళాకారులను కూడా అంతగా ఎవరూ గుర్తుపెట్టుకోరు. ప్రజలకు చేరువయ్యేందుకు తమ లాంటి వారికి ఏదో ఒక వేదిక కావాలి. ‘తాజ్‌ టీ’ ప్రకటన తనకు అలాగే ఉపయోగపడిందన్నారు. ఆ యాడ్‌లో తాను కన్పించింది 30 సెకన్లే అయినా.. తనను చాలామంది గుర్తుపట్టేలా చేసిందన్నారు. తాను ఎవరనే ఆసక్తిని అందరిలోనూ మరింత పెంచింది’’ అని జాకిర్‌ నాడు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.