వందేళ్లుగా భోగి వేడుకలకు దూరంగా ఉంటున్న రెండు గ్రామాలు
సంక్రాంతి పండగ అంటే తెలుగు వారికి పెద్ద పండుగ. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో మొదటి రోజు జరిగే భోగి పండుగ ఒక స్పెషల్. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ భోగి పండుగకు వారం రోజుల ముందు నుండే రెడీ అవుతారు. ఎండిన చెట్లు కొట్టి, ఆవు పేడతో భోగి మంటలు వేయటానికి కలపను కూడా సిద్ధం చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి రోజు భోగిపళ్లకు విశిష్ట ప్రాధాన్యత ఇస్తారు.
సంక్రాంతి పండగ అంటే తెలుగు వారికి పెద్ద పండుగ. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో మొదటి రోజు జరిగే భోగి పండుగ ఒక స్పెషల్. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ భోగి పండుగకు వారం రోజుల ముందు నుండే రెడీ అవుతారు. ఎండిన చెట్లు కొట్టి, ఆవు పేడతో భోగి మంటలు వేయటానికి కలపను కూడా సిద్ధం చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి రోజు భోగిపళ్లకు విశిష్ట ప్రాధాన్యత ఇస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న భోగి పండుగకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లోవారు గత వందేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దశాబ్దాల క్రితం భోగి మంటలు వేసే సమయంలో చోటు చేసుకున్న అపశ్రుతుల వల్ల ఈ భోగి పండుగకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా జియ్యమ్మవలస మండలంలోని బాసంగి, కొమరాడ మండలంలోని కళ్లికోటలో ఈ భోగి పండుగను చేసుకోవడం లేదు. బాసంగిలో జరిగిన భోగిమంటలో గ్రామస్తులు సింహాద్రి అప్పన్న గా భావించే ఎద్దుకు మంటలు అంటుకొని మృత్యువాత పడింది. అదే సంవత్సరం ఆ గ్రామంలోని ప్రతి ఇల్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. దీంతో దైవ స్వరూపంగా భావించిన బసవన్న మృతితోనే ఇంతటి అనర్థం జరిగిందని భావించారు. అప్పటి నుండి ఆ గ్రామస్తులు భోగి పండుగకు దూరంగా ఉంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల
శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.