పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో

Updated on: Mar 17, 2026 | 8:20 PM

విజయనగరం జిల్లా పోలీసులు కూరగాయల రవాణా ముసుగులో జరుగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించారు. జాతీయ రహదారిపై నార్కొటిక్ బృందం చేసిన తనిఖీల్లో ఒడిశా నుండి వస్తున్న వాహనంలో క్యాబేజీ బుట్టల కింద 650 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

పోలీసులు, ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా.. అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. పోలీసులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్‌కు ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. తాజాగా కూరగాయల రవాణా ముసుగులో సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను విజయనగరం జిల్లా పోలీసులు ఛేదించారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. పక్కాసమాచారంతో.. నార్కొటిక్ అధికారులు జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని అనుమానంతో అడ్డుకున్నారు. పైకి సాధారణంగా కూరగాయల లోడ్‌తో కనిపిస్తున్న ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనంలో క్యాబేజీ బుట్టల అడుగున అత్యంత చాకచక్యంగా దాచిన 123 గంజాయి ప్యాకెట్లను గుర్తించిన అధికారులు షాకయ్యారు. తనిఖీల్లో సుమారు 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కూరగాయల రవాణా పేరుతో అధికారుల కళ్లు గప్పి ఇతర రాష్ట్రాలకు ఈ సరుకును తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, వాహనాన్ని బొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన ముఠా ఎవరు? ఒడిశా సరిహద్దుల నుండి ఈ నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు

దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..

Follow Us