ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి సందర్భంగా ఒక కృత్రిమ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా రూపుదిద్దుకున్న ఈ పల్లెటూరి సెట్టింగ్‌లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నిజమైన గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రత్యేక ఏర్పాటు నగరవాసులకు సంక్రాంతి పండుగ అనుభూతిని పంచుతోంది.
విశాఖపట్నం నగరంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఒక కృత్రిమ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో రూపు దిద్దుకున్న ఈ విలేజ్, గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేయగా, విశాఖ ప్రజలు ఈ పల్లెటూరి సెట్టింగ్‌లకు ఫిదా అవుతున్నారు. ఈ కృత్రిమ గ్రామంలో పూర్వకాలపు ఇళ్ల వాతావరణం, కోడిపుంజులు, డూడూ బసవన్నలు వంటి గ్రామీణ అంశాలతో అలంకరించారు. ఇళ్ల రంగుల కలయిక, ప్రత్యేక ముగ్గులు, గడ్డి పైకప్పులు వంటి వివరాలు గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నగరంలో పల్లెటూరి వాతావరణం లేని వారికి ఈ ఏర్పాటు నిజమైన సంక్రాంతి అనుభూతిని పంచుతుందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!