ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!

Updated on: Jul 07, 2025 | 8:47 PM

ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం కార్గో హోల్డ్‌లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. దీంతో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటన మంగళవారం మెల్‌బోర్న్ విమానాశ్రయంలో జరిగింది. వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన వీఏ337 విమానం మెల్‌బోర్న్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు సిద్ధమైంది.

ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతుండగా సిబ్బంది కార్గో హోల్డ్‌లో పామును గుర్తించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, స్నేక్‌ క్యాచర్‌ మార్క్ పెల్లీకి సమాచారం అందించారు. విమానాశ్రయానికి చేరుకున్న పెల్లీ.. విమానపు కార్గో హోల్డ్‌లోకి వెళ్లి.. అక్కడి ఫ్యానల్‌లో నక్కిన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ చీకటిలో అదో విషపూరితమైన పాము అనుకున్నానని, కానీ, అది మామూలు పామేనని పెల్లీ తెలిపారు.ఇంకాస్త ఆలస్యమైతే, ఆ పాము ప్యానెళ్ల లోపలికి వెళ్లిపోయేదని, అప్పుడు విమానాన్ని ఖాళీ చేయించి, దాన్ని వెతకాల్సి ఉండేదని అన్నాడు. దాదాపు 60 సెంటీమీటర్ల పొడవున్న ఆ పాము బ్రిస్బేన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని, బహుశా అక్కడి ప్రయాణికుల లగేజీ ద్వారా అది విమానంలోకి చేరి ఉండొచ్చిని పెల్లీ అభిప్రాయపడ్డాడు. ఇది రక్షిత జాతి జాబితాలో ఉన్న పాము గనుక దీనిని అడవిలో వదిలిపెట్టే అవకాశం లేకపోవటంతో లైసెన్స్ ఉన్న సంరక్షకుడికి అప్పగించామని పెల్లీ తెలిపాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్

చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్

ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ

నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్‌..

అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక