Viral Video : గౌన్ ధరించడానికి ఇబ్బందిపడిన సన్నీలియోన్..! అందుకోసం ఎంటైర్ టీమ్ కష్టపడింది..?

|

May 25, 2021 | 5:31 AM

Viral Video : నటి సన్నీ లియోన్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అలర్ట్‌గా ఉంటుంది

Viral Video : గౌన్ ధరించడానికి ఇబ్బందిపడిన సన్నీలియోన్..! అందుకోసం ఎంటైర్ టీమ్ కష్టపడింది..?
Sunny Leone
Follow us on

Viral Video : నటి సన్నీ లియోన్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అలర్ట్‌గా ఉంటుంది అభిమానులతో ఎల్లప్పుడూ సన్నిహితంగా మెదులుతుంది. తన లైఫ్ స్టైల్‌ గురించి ఎల్లప్పుడు వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సెక్సీ స్టార్‌ అందమైన గౌన్ ధరించడానికి ఆమె ఎంటైర్ టీమ్ కష్టపడింది. ఈ వీడియోను స్వయంగా సన్నీ లియోన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పడు అది వైరల్‌గా మారింది.

ఒకప్పుడు నీలి చిత్రాల నటిగా ఉన్న సన్నీ లియోన్ తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె చాలా టీవీ రియాలిటీ షోలలో కూడా కనిపించింది. MTV ప్రసిద్ధ స్ప్లిట్స్విల్లా ప్రదర్శనకు ఆమె యాంకర్‌గా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమానికి దుస్తులు ధరించడం ఎంత కష్టమో వివరించడానికి సన్నీ లియోన్ ఈ వీడియోను షేర్ చేసింది. ఏదేమైనా ప్రముఖులను బహిరంగంగా అందంగా చూపడానికి వారి వెనుక ఒక బృందం పనిచేస్తుంది. ఆమె మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్ అన్నీ టీమ్ చూసుకుంటుంది. సన్నీతో అలాంటి టీమ్ ఒకటి ఎప్పుడు ఉంటుంది. స్ప్లిట్స్విల్లా ఈవెంట్ కోసం అందమైన గౌను ధరించేటప్పుడు వెనుక వైపు జిప్ లాగడం కోసం అందరు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. చివరికి ఏదో ఒక విధంగా సాధించారు.

సన్నీ లియోన్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది, ‘గౌను అందంగా కనిపించడానికి సైన్యం అవసరం.’ నలుగురు కలిసి ఒక గౌను ధరించడానికి ప్రయత్నించారు. అని రాసింది. సన్నీ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పడు ఈ వీడియో వైరల్‌గా మారింది. సన్నీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు (మే 13) జరుపుకున్నారు. ఈ సెక్సీ స్టార్ పుట్టినరోజును మాండ్యలోని ఒక గ్రామంలో పెద్ద బ్యానర్‌తో అలంకరించారు. ఆ ఫోటో కూడా వైరల్‌గా మారింది.

Allu Sirish: కష్టపడి కండలు పెంచుతున్న అల్లువారి చిన్నబ్బాయి.. జిమ్ లో చమటలు చిందిస్తున్న శిరీష్

ఇంటి మొక్కల నుండి ఆక్సిజన్ ను ఇలా తయారుచేసుకోండి..పురిఫ్య్ చేసి మంచి OXIGEN (O2) అందిస్తాయి:Oxigen Video.

Covid 19 Virus: కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష.. కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై ఆసక్తికర చర్చ..