Viral Video: వాట్ ఏ డెడికేషన్.. ప్రమాదం జరిగినా రిపోర్టింగ్ ఆపలే.. సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో

|

Jan 26, 2022 | 11:29 AM

Trending Video: ప్రత్యక్ష ప్రసారంలో ఓ మహిళా రిపోర్టర్‌ను కారు ఢీకొట్టింది. అయినా రిపోర్టింగ్ చేయడం మాత్రం ఆపకపోవడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video: వాట్ ఏ డెడికేషన్.. ప్రమాదం జరిగినా రిపోర్టింగ్ ఆపలే.. సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Reporter Viral Video
Follow us on

Viral Video: నెట్టింట్లో ఎన్నో వీడియో(Viral Video)లు సందడి చేస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రం అందరి మనసులను దోచుకుంటూ దూసుకెళ్తుంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే వీడియో కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రత్యక్ష ప్రసారంలో ఓ మహిళా రిపోర్టర్‌ను కారు ఢీకొట్టింది. అయినా రిపోర్టింగ్ చేయడం మాత్రం ఆపకపోవడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. WSAZ-TVలో రిపోర్టర్ అయిన టోరీ యోర్గీ, స్టూడియోలో ఉన్న యాంకర్ టిమ్ ఇర్‌తో వాతావరణాణికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఒక కారు(Accident) వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆమె కింద పడిపోయింది. కింద పడినా తను మాత్రం రిపోర్టింగ్‌ మాత్రం ఆపలేదు. అలానే రిపోర్టింగ్ చూస్తూనే పైకి లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్‌ అవుతోంది.

వెస్ట్ వర్జీనియాలోని డన్‌బార్‌లో వెదర్ రిపోర్ట్ గురించి తను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. ఆ వెంటనే ఆమె ఓరి దేవుడా!అంటూ కోపగించిన ఆమె.. “నన్ను ఇప్పుడే కారు ఢీకొట్టింది. కానీ, నేను ఓకే. నాకు బాగేనే ఉంది టిమ్” అంటూ లైవ్‌లో ఉన్న యాంకర్‌తో చెప్పడం వీడియోలో చూడొచ్చు.

జర్నలిస్టులు వార్తలు చెప్పే పరిస్థితులపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “ఆమె దెబ్బ తగిలినా రిపోర్టింగ్ ఆపలేదు. లక్ బాగుంది. ఏం కాలేదు. ఇకపై జాగ్రత్త” అంటూ రాసుకొచ్చారు. “నమ్మశక్యం కాలేదు. ప్రమాదకరమైన పరిస్థితి తరువాత కూడా తను రిపోర్టింగ్ చేస్తూనే ఉంది” హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేశాడు. ‘వాట్ ఏ డెడికేషన్.. సెల్యూట్.. పెద్ద ప్రమాదం తప్పింది’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

Also Read: Viral Video: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా..! ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు చుస్తే మతి పోవాల్సిందే..(వీడియో)

73rd Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టెంక్షన్.. దేశ రాజధానిలో హై అలర్ట్‌..!(వీడియో)