అంతమంది జనం మధ్య సిగ్గు లేని పని చేశాడు.. ఆ తరువాత

Updated on: Nov 24, 2025 | 5:04 PM

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది, పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యను ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా, నీటి ట్యాంకర్ సిబ్బంది అతడిపై నీళ్లు కొట్టి గుణపాఠం చెప్పిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ, ఇలాంటి చర్యలు అవశ్యకతను నొక్కి చెప్పారు.

చాలామంది బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్‌ టాయిలెట్లను ఉపయోగించకుండా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇలా చేయడం నేరమే కాకుండా వాతావరణం కలుషితమవుతుంది.. పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా అవేమీ పట్టించుకోరు కొందరు. అలా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తికి మున్సిపల్‌ అధికారులు తగిన గుణపాఠం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.. తిక్క కుదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన గోడకు ఆనుకుని నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ మార్గమంతా వచ్చిపోయే జనాలతో హడావిడిగా ఉంది. అయినా ఆ వ్యక్తి సిగ్గు లేకుండా తన పని కానిస్తున్నాడు. ఇంతలో ఆ రోడ్డులో ఒక నీటి ట్యాంకర్ వెళ్తోంది. రోడ్డుపక్కన ఆ వ్యక్తి చేస్తున్న పనిని చూసిన ఆ నీటిట్యాంకర్‌ సిబ్బంది అతనిపై పైపుతో నీళ్లు కొట్టారు. భారీ పైపు నుంచి పొలోమంటూ వచ్చి నీరు మీద పడేసరికి ఉలిక్కిపడ్డాడు సదరు వ్యక్తి. దాని నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ట్యాంకర్‌పైనున్న వ్యక్తి అతన్ని వదలకుండా నీటిని కొడుతూనే ఉన్నాడు. దాంతో ఆ వ్యక్తి పూర్తిగా తడిసిపోయాడు. ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. కానీ ట్యాంకర్‌పై ఉన్న వ్యక్తి అతన్ని వదలకుండా నీటిని కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఇలాంటివాళ్ల తిక్క కుదిరింది.. మంచి మంచి గుణపాఠం నేర్పారంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో.. అలాంటి వారికి ఇలాగే జరగాలని అన్నారు. ఇంకొందరు.. ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ స్టేషన్‌లో ఎయిర్‌పోర్టును మించిన లగ్జరీలు

ఈ సూపర్‌ మార్కెట్‌లో అన్నీ ఫ్రీనే

రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు

చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే

ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం