Viral Video: తన హెయిర్‌నే దుస్తులుగా మార్చేసింది..? వైరలవుతోన్న వీడియో!

జట్టును పెంచడం చాలా మందికి ఓ హాబీ. చాల పెద్దగా పెంచిన జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేయడం మన చూశాం. అయితే కొంతమంది సృజనాత్మకతను జోడించి ఇంకాస్త ముందుంటారు.

Viral Video: తన హెయిర్‌నే దుస్తులుగా మార్చేసింది..? వైరలవుతోన్న వీడియో!
Girl Makes Beautiful Dress With Her Long Hair

Updated on: Jun 27, 2021 | 10:37 AM

Viral Video: జట్టును పెంచడం చాలా మందికి ఓ హాబీ. చాల పెద్దగా పెంచిన జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేయడం మన చూశాం. అయితే కొంతమంది సృజనాత్మకతను జోడించి ఇంకాస్త ముందుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఉన్న మహిళ కూడా అలాంటి వర్గానికే చెందుతోంది. ఏకంగా తన జుట్టునే డ్రెస్‌లాగా మార్చేసింది. ఈమె జుట్టు చాలా పొడవుగా, మందంగా ఉంది. దీంతో తన జుట్టును దుస్తుల్లాగా తన శరీరానికి చుట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. గోధుమ రంగుతో ఉన్న తన పొడవాటి జుట్టుతో.. ఒక అందమైన డ్రెస్‌ను డిజైన్ చేసుకుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హెప్గుల్ 5 అనే ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఉన్న మహిళ టోపీ, సన్ గ్లాసెస్ ధరించి ఉంది. తన గోధుమ రంగు జుట్టుతో శరీరానికి చుట్టి సరికొత్త డ్రెస్‌ను ధరించి హోయలు పోయింది. బ్లాక్ బెల్టుతో శరీరానికి బిగించింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు 5000 వేల లైక్స్‌తో పాటు ఎన్నో కామెంట్లతో దూసుకపోతోంది.

చాలామంది ఆమె డ్రెస్‌ను చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు మాత్రం నీది సూపర్ ఐడియా అంటూ పొగిడేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది నిజమైన జట్టు కాకపోవచ్చు. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని ఉపయోగించి ఇలా చేసి ఉండొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం జుట్టుతో డ్రెస్ వేసుకోవాలన్న నీ ఐడియా అదిరింది అంటూ కామెంట్లు చేశారు. తన జుట్టునే డ్రెస్‌లా మార్చి హోయలు పోయే మహిళ వీడియోను మీరూ చూడండి..

Also Read:

Viral Video: వీడు సామాన్యుడు కాదు.. ఏకంగా మంచం కింద పెద్ద సొరంగం తవ్వేశాడు.. వైరల్ వీడియో!

Ghost Caught on Camera: ఎవరూ లేరని ఆ ఇంట్లోకి వెళ్లారు.. ఊహించని షాక్‌తో వెనుదిరిగారు.. షాకింగ్ వీడియో మీకోసం..

సీఎం సెక్యూరిటీ చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా.. ( వీడియో )