ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..

Updated on: Dec 02, 2025 | 6:48 PM

కుటుంబం రెండు నెలల సెలవుకు వెళ్ళి గుడ్లు ఇంట్లో వదిలింది. తిరిగి రాగానే ఇంటి నిండా కోడిపిల్లలు తిరుగుతూ కనిపించాయి. వంటగదిలోని గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. ఈ ఊహించని సంఘటన వైరల్ వీడియోగా మారింది. నెటిజన్లు దీనిని "ప్రకృతి అద్భుతం" అని అభివర్ణిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం.

సోషల్‌ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని భయానకంగా ఉంటాయి..కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన ఫ్యామిలీ రెండు నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీసి లోపలకి వెళ్లగానే వారికి ఊహించని సీన్‌ ఎదురైంది. దాంతో వారు ఖంగు తిన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లినట్టుగా తెలుస్తుంది. వెళ్ళే ముందు వారు వంటగదిలో మూడు ట్రేలలో గుడ్లు అలానే ఉంచేసి వెళ్లిపోయారు. దాదాపు రెండు నెలల తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. వారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా కోడి పిల్లలు తిరుగుతూ కనిపించాయి. వంటగదిలోని ట్రేలో ఉన్న ప్రతి గుడ్డు నుండి చిన్న పిల్లలు బయటకు తొంగి చూస్తున్నాయి. మరికొన్ని మూలల్లో, వంటగదిలో, ఇంట్లో వస్తువుల మధ్య తిరుగుతూ కనిపించాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒక చిన్న కోళ్ల ఫారం పుట్టుకొచ్చినట్లు అనిపించింది. ఇది ఎలా జరిగిందో తెలియక కుటుంబం ఆశ్చర్యపోయింది. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు… ఇది ప్రకృతి అద్భుతం అని, రెండు నెలల్లో ఇల్లు కోళ్లఫారంగా మారిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..