Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు

|

Sep 24, 2021 | 10:32 AM

బేస్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ పెంపుడు శునకం మైదానంలోకి ప్రవేశించి నానా హంగామా సృష్టించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు
Dog steals the bat and interrupts the baseball game
Follow us on

Viral News: బేస్ బాల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.. ఇంతలోనే ఓ పెంపుడు శునకం గ్రౌండ్‌లోకి ఎంటర్ అయ్యింది. బ్యాట్‌ను నోట కరుచుకుని నానా హంగామా సృష్టించింది. గ్రౌండ్‌లో అటూ ఇటూ పరుగులు పెడుతూ కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. మొత్తానికి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు వ్యక్తులు మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో మైదానంలోకి దూసుకెళ్లి.. మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన దృశ్యాలను మనం చాలా చూసే ఉంటాం.. అయితే ఇలా ఓ పెంపుడు శునకం గ్రౌండ్‌లోకి ప్రవేశించి మ్యాచ్‌ను అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ఆసక్తిరేపుతున్నాయి. ఈ వీడియోలను మైనర్ లీగ్ బేస్‌బాల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఇంతకీ పెంపుడు శునకాన్ని గ్రౌండ్ లోపలికి ఎలా అనుమతించారన్న సందేహం మీరు కలుగుతోందా..? వాస్తవానికి ఇది ఓ బేస్ బాల్ జట్టుకు బ్యాట్ డాగ్‌గా పనిచేస్తుంది. ఆ శునకం మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా.. ఎవరూ ఇబ్బందికి గురికాలేదు. దాని చేష్టలు మైదానంలోని వీక్షకులను కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఆ శునకం చేష్టలు నెటిజన్లకు బాగా నచ్చేసింది. అందుకే ఈ వైరల్ వీడియోలో ఒకదానికి 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

సహజంగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిత్యం జంతులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Also Read..

Viral Video: సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. మృగరాజుకు అడ్డుతగులుతూ.. అద్భుతమైన వీడియో మీకోసమే.!

Viral Video: కన్న తండ్రి కూతరు పై చేసిన పైశాచికానీ చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి.. వీడియో