Viral Video: రెండు పాముల మధ్య పోరు.. తన తోకతో మెడను చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసిన మరో పాము.. వీడియో వైరల్

పాము అనే ఒక్క మాట చాలు చాలా మందిలో భయం, వణుకు పుట్టిస్తుంది. భూమిపై భయానక జీవులలో పాములు కూడా ఒకటని చెప్పవచ్చు. పాములు చూశారంటే చాలు వెంటనే పరుగులు తీస్తుంటారు. దాని విషం, ప్రమాదం వంటివి భయాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ పాముల పట్ల సహజంగా ఉన్న భయాన్ని పక్కన పెడితే, రెండు పాముల మధ్య పోటీ తత్వం నెలకొంటుంది. అవి ఎదురు పడితే చాలా దాడులకు సైతం సిద్ధమవుతుంటాయి. పాముల పరస్పర చర్యలు కూడా భయంకరంగానే ఉంటుంది.

Viral Video: రెండు పాముల మధ్య పోరు.. తన తోకతో మెడను చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసిన మరో పాము.. వీడియో వైరల్
Viral Video

Updated on: Aug 02, 2023 | 7:38 PM

పాము అనే ఒక్క మాట చాలు చాలా మందిలో భయం, వణుకు పుట్టిస్తుంది. భూమిపై భయానక జీవులలో పాములు కూడా ఒకటని చెప్పవచ్చు. పాములు చూశారంటే చాలు వెంటనే పరుగులు తీస్తుంటారు. దాని విషం, ప్రమాదం వంటివి భయాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ పాముల పట్ల సహజంగా ఉన్న భయాన్ని పక్కన పెడితే, రెండు పాముల మధ్య పోటీ తత్వం నెలకొంటుంది. అవి ఎదురు పడితే చాలా దాడులకు సైతం సిద్ధమవుతుంటాయి. పాముల పరస్పర చర్యలు కూడా భయంకరంగానే ఉంటుంది. రెండు పాముల మధ్య జరిగే యుద్ధం మామూలుగా ఉండదు. అయితే సాధారణంగా జంతువులు, పాముల వీడియోలు సోషల్‌ మీడియా వైదికగా తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

రెండు పాములు ఒకదానికొకటి ఎదురైనప్పుడు వాటి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. రెండు పాముల మధ్య జరిగిన ఘోరమైన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోలో ఓ పాము మరో పాము మెడను తోకతో చుట్టేసింది. ఈ పాములు తమ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. కెమెరాలు రోల్ చేస్తున్నప్పుడు, ఓ వ్యక్తి వాటిని కదిలిస్తున్నప్పుడు కూడా ఏ మాత్రం పట్టు విడవకుండా ఉండటం గమనించవచ్చు. ఓ నల్లపాము తన తోకతో మరో పామును చుట్టి కదలనీవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రిప్పింగ్ క్లిప్ వైరల్‌ అయి 11,000 కంటే ఎక్కువ లైక్స్‌ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి