పాముకి చుక్కలు చూపించిన పిల్లి.. చివరికి వీడియో

Updated on: Sep 01, 2025 | 6:40 PM

కొందరు ఉంటారు తమ దారిన తాము పోతుంటే పిలిచి మరి వారితో గొడవకు దిగుతారు. అదే వారికి ఒక సరదా. వారితో అనవసర వాగ్వాదానికి దిగి అయోమయానికి గురి చేస్తారు. ఈ క్రమంలో చివరికి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళతారు. తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఇరుకుంటారు. ఇక్కడ ఓ పిల్లి కూడా అదే చేసింది. ఆహారం వెతుక్కుంటూ తన దారిన తాను పోతున్న పాముపై దాడికి దిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు ఓరి దినేశా అంటూ పిల్లి తీరుకు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి ఆవరణలో పిల్లి కూర్చుని ఉంది. ఇంతలో అటుగా ఓ పాము వచ్చింది. పిల్లిని చూసిన పాము అది మనల్ని ఏం చేస్తుందోలే అనుకొని తన దారిన తాను పోతుంది. కానీ పిల్లి మాత్రం పామును ఏయ్ నా అడ్డాలోకి నువ్వు ఎందుకు వస్తున్నావ్ అన్నట్లుగా దానిపై తన కాళ్ళతో దాడి చేసింది. అయితే పాము కూడా పిల్లిని గట్టిగానే ఎదుర్కొంది. పిల్లి తన కాళ్ళతో రుక్కుతూ దాడి చేస్తూ ఉంది. పాము కూడా పిల్లిని కాటు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ప్రతిఘటించింది. అయితే పిల్లి తెలివిగా తప్పించుకుంటూ పాముకి చుక్కలు చూపించింది. పోట్లాడి అలసిపోయిన పాము నీరసంగా పడుకుని పోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

ఎయిర్‌షోలో షాక్‌..అగ్నిగోళంగా యుద్ధ విమానం.. ఫైలెట్ మృతి!

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

దారిచ్చే సముద్రం చూసారా? ఏటా రెండుసార్లు.. ఎక్కడంటే వీడియో