ప్రైమరీ స్కూల్‌లోకి ఏనుగు పిల్ల అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు

Updated on: Aug 26, 2025 | 11:05 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఓ పాఠశాల ఆవరణలోకి వచ్చిన అనుకోని అతిథిని చూసి అడ్మిషన్‌ కావాలేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

కేరళ-కర్ణాటక సరిహద్దులోని పుల్పల్లి నుండి దాదాపు 14 కి.మీ దూరంలో ఉన్న చెకాడి గ్రామం మూడు వైపులా అడవితో చుట్టుముట్టబడి ఉంది. వరి పొలాలకు, ప్రధానంగా గిరిజన సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ తరగతులను కూడా కలిగి ఉన్న ప్రభుత్వ LP స్కూల్ దాదాపు 115 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఎకరంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్‌లో తరచూ ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. స్కూలు అయిపోయాక.. సూర్యాస్తమయం తర్వాత తరచుగా మందలుగా ఏనుగులు ఇక్కడ సంచరిస్తాయి. ఈ క్రమంలోనే అనుకోకుండా సోమవారం ఉదయం ఓ ఏనుగు పిల్ల ఒంటరిగా స్కూల్‌ ఆవరణలోకి వచ్చింది. పిల్లల కేరింతలు, సందడి చూసి వారితో ఆడుకోవాలనుకుందో, లేక తనుకూడా స్కూలుకి వెళ్లి పాఠాలు చదువుకోవాలనుకుందో కానీ గున్న ఏనుగు సరాసరి ఓ క్లాస్‌రూమ్‌ దగ్గరకు వెళ్లింది. అనంతరం ఆ పాఠశాల ఆవరణలో తిరుగుతూ సందడి చేసింది. గున్న ఏనుగును చూసి ఇటు ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆశ్చర్యపోయారు. చిట్టి ఏనుగును చూసి విద్యార్ధులు సంతోషంతో కేరింతలు కొట్టారు. ఈ సంఘటన మొత్తం స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ గున్న ఏనుగు వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిట్టి ఏనుగుకి అడ్మిషన్‌ కావాలేమో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా.. అసలైన పేరెంటింగ్ అంటే.. కూతురికి జీవిత పాఠాలు నేర్పుతున్న తండ్రి

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?

NTR సినిమాపై నారా రోహిత్ కుట్ర.. క్లారిటీ

సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్