రోడ్డు పైకి బాతుల గుంపు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో వైరల్‌

Updated on: Oct 11, 2025 | 12:30 PM

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నగరంలో ఇటీవల భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు చాలా స్పీడ్‌గా దూసుకెళ్తున్నాయి. అయితే రోడ్డు క్రాస్‌ చేస్తున్న కొన్నిటిని చూసి వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాటిని చూసి సడెన్‌గా బ్రేక్‌ వేయాల్సి వచ్చింది. కొన్ని వాహనాలు నియంత్రణ కోల్పోయాయి. ఒకదాని వెంట మరొకటి ఇలా పలు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. పెర్త్ లోని కోమోలోని కానింగ్‌ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? భారీ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమేంటని ముందుకొచ్చి చూసిన వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఓ భారీ బాతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. అది గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. ఆ బాతుల గుంపు ఎంచక్కా ఒకదాని వెనుక మరొకటి నడుచుకుంటూ రోడ్డును దాటాయి. అవి పూర్తిగా రోడ్డు దాటే వరకు వాహనదారులు వేచి చూసారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. వాహనదారులు ప్రవర్తించిన తీరును పశంసిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఘటనలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. పెర్త్ లోని కోమోలోని కానింగ్‌ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? భారీ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమేంటని ముందుకొచ్చి చూసిన వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఓ భారీ బాతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. అది గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. ఆ బాతుల గుంపు ఎంచక్కా ఒకదాని వెనుక మరొకటి నడుచుకుంటూ రోడ్డును దాటాయి. అవి పూర్తిగా రోడ్డు దాటే వరకు వాహనదారులు వేచి చూసారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. వాహనదారులు ప్రవర్తించిన తీరును పశంసిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జపాన్.. త్వరలో లాక్ డౌన్ !! ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అఖండ 2 ప్రమోషన్‌ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??

గేరు మార్చిన టాప్‌ కెప్టెన్స్‌.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు

రీ రిలీజ్‌ సినిమాలకు మళ్లీ క్రేజ్‌.. రెడీ అయిన వరుస సినిమాలు