ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా..

Updated on: Jun 20, 2025 | 3:06 PM

కట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ నేరమే.కానీ, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులూ నేటికీ కూతురి పెళ్లిలో ఎంతో కొంత నగదు, బంగారం, ఇతర ఆస్తులను కట్నకానుకల కింద ఇస్తూనే ఉన్నారు. అయితే, వియత్నాం దేశంలోని ఒక పెద్దాయన మాత్రం తన కూతురి పెళ్లిలో కట్నకానుకలతో బాటు అల్లుడికి ఏకంగా ఓ వంద అత్యంత అరుదైన పునుగు పిల్లుల్ని కూడా బహుమతిగా ఇచ్చాడు.

వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఆ మామగారి అసలు ఆలోచన తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఎందుకంటే.. ఈ పునుగు పిల్లులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన కాఫీ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి.పెళ్లి తర్వాత తన బిడ్డ.. ఆ కాఫీ వ్యాపారం పెట్టాలని అనుకుందని, అందుకే కాస్త ఖర్చయినా.. అన్ని పిల్లుల్ని కొని కానుకగా ఇచ్చానని సదరు మామగారు చెప్పుకొచ్చారు. ఇక.. ఈ పునుగు పిల్లి వివరాల్లోకి పోతే.. సదరు ఖరీదైన కాఫీని తయారు చేయటానికి ముందు.. బాగా పండిన కాఫీ గింజలను ముందుగా ఈ పిల్లులకు తినిపిస్తారు. ఆ గింజలన్నీ మలం రూపంలో పిల్లులు విసర్జించాక.. ఆ మలాన్ని సేకరించి, అందులోని జీర్ణం కాకుండా మిగిలిపోయిన కాఫీ గింజలను సేకరించి.. వాటిని దంచి సదరు ఖరీదైన కాఫీ పొడిని తయారు చేస్తారు. ఎంతో డిమాండ్, పేరు ఉన్న సదరు కాఫీ పొడి తయారీలో కీలకంగా ఉన్న ఈ పిల్లుల ఖరీదు కూడా చాలా ఎక్కువే. సదరు మామగారైతే.. ఏకంగా $70,000 అంటే మన కరెన్సీలో సుమారు రూ.60,27,595 పెట్టి ఆ పిల్లులను కొని కట్నంగా ఇచ్చాడు. పిల్లులతో బాటు అల్లుడికి పెళ్లిలో 25 బంగారు బిస్కెట్లు, రూ. 17 లక్షల నగదు, తన కంపెనీలో కొంత వాటా, ఇంకా కొన్ని ఇతర ఆస్తులూ కానుకగా ఇచ్చాడు.దీనికి బదులుగా వియ్యాలవారి కుటుంబం.. పెళ్లి కూతురికి 10 బంగారు బిస్కెట్లు, మాంఛి.. విలువైన వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చింది. ఇంతకీ పునుగు పిల్లి తిన్న కాఫీ గింజలతో చేసిన కాఫీ ప్రత్యేకత ఏమిటా అనుకుంటున్నారా? ఈ కాఫీ ఇతర కాఫీల కంటే.. సాఫ్ట్‌గా, భలే కమ్మని రుచిగా ఉంటుందట. అంతేకాదు.. ఈ కాఫీ ఎసిడిటీ కూడా బాగా తక్కువట. అలాగే, ఈ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయని,దీనివల్ల ఆరోగ్యానికి మంచిదని నమ్మకం ఉంది. అంతేకాదండోడోయ్.. ఆ పిల్లి మలం నుండి తీసిన నూనెను ఆయుర్వేదంలో నొప్పి నివారణకు, చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

Prabhas: ప్రభాస్‌ను వదలని పోలీసులు.. కారణం అదేనా..