ఇనుప రాడ్ల లారీ బోల్తా..ఆటోపై పడిన వీడియో వైరల్ !
రిపబ్లిక్ దినోత్సవం వేళ వరంగల్ జిల్లాలో ఘోర విషాదం జరిగింది. వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారి పైన ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాలతో వెళుతున్న లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు రెండు ఆటోల పైన పడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇనుప రాడ్ల కింద రెండు ఆటోలు ఉండడంతో ఈ ఘటనలో మరింత మంది చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మరికొందరు ఇనుప స్తంభాల కింద ఇరుక్కోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇనుప స్తంభాలను తొలగించి మృతులను వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇనుప రాడ్లతో వెళుతున్న లారీ ఆటోను ఓవర్టేక్ చేయబోయి బోల్తా కొట్టినట్టు, దీంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు ఆ రోడ్డుపై వెళ్తున్న ఆటోల పైన పడినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన దినసరి కూలీలను మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే లారీని నడిపిన డ్రైవర్ మద్యం సేవించి ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మామునూరు రోడ్డుపై జరగడంతో వరంగల్ ఖమ్మం రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా పడిన ఇనుప స్తంభాలను జెసిబి ల సహాయంతో తొలగించారు.
వైరల్ వీడియోలు

కారును రైల్వే ప్లాట్ఫామ్పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
