వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

Updated on: Jun 17, 2025 | 8:10 AM

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని నానుడి. ఆ ధీమాతోనే ఓ ప్రబుద్ధుడు ప్రియురాలి ముచ్చట తీర్చడానికి సొంత ఇంట్లోనే కన్నం వేశాడు. కన్నతల్లి బంగారం దొంగిలించి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తమదైన శైలిలో దొంగను పట్టుకొని కటకటాల్లోకి పంపించారు. ఈ చోరీ ఘటన ఖిల్లా వరంగల్ లో జరిగింది.. సోమవారం తెల్లవారుజామున రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరచిన 16 తులాల బంగారం ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. లబోదిబోమంటూ రామకృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రామకృష్ణ కొడుకు జయంత్ బంగారం చోరిపై పోలీసుల ముందు తెగ హడావిడి చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులకు జయంత్‌ హడావిడి చూసి కాస్త అనుమానం కలిగింది. దీంతో తమదైనశైలిలో జయంత్‌ను విచారించే సరికి అసలు విషయం బయటపెట్టాడు. రామకృష్ణ ఇంట్లో బంగారం పోవడం ఇంటిదొంగ పనేనని తేల్చారు. హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జయంత్ అదే కళాశాలల్లో చదువుతున్న ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతిని ఆకట్టుకోవడం కోసం, ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న తల్లి బంగారంపై కన్నేశాడు. తన జల్సాల కోసం బంగారం కొట్టేసి, దొంగలు దోచుకెళ్లినట్టు సీన్‌ క్రియేట్‌ చేశాడు. ఎంత తెలివైనవారైనా ఎక్కడో అక్కడ పొరపాటు చేయకపోతారా అన్నట్టుగా అతని సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ అతన్ని పట్టించింది. దొంగతనం జరిగిన సమయంలో అతని సెల్ నెట్వర్క్ ఆధారంగా పోలీసులు విచారించగా అసలు కథ బయటపడింది. బంగారం దొంగిలించింది జయంతేనని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి, 16 తులాల బంగారం రికవరీ చేశారు. తల్లిదండ్రులతో పాటు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి చోరీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. కన్న కొడుకే ఇంట్లో బంగారం దొంగిలించడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు.

మరిన్నివీడియోల కోసం :

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో