ఇది కదా తల్లి ప్రేమంటే.. వీడియో
సృష్టిలో తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదంటారు. జన్మనిచ్చింది మొదలు కన్నుమూసే వరకు అనుక్షణం బిడ్డల భవిష్యత్తే లక్ష్యంగా ఆ తల్లి పడే ఆరాటం మాటల్లో వర్ణించలేనిది. ఈ క్రమంలో బిడ్డలు తప్పుచేసినా.. వారిని ప్రేమతో సహిస్తుంది..భరిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే, ఈ తల్లి ప్రేమ.. కేవలం మనుషులకే పరిమితం కాదు. జంతువుల్లోనూ ఉంటుందనటానికి ఈ వీడియోనే నిదర్శనం. కొలనులో సంతోషంతో గంతులేస్తున్న తన కూనలకు రక్షణగా గట్టుపైన కూర్చొన్న ఆ తల్లి పులి పహారా కాస్తున్న తీరు.. చూపరులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవిలో ఓ తల్లిపులి పిల్లలతో సహా కొలను వద్దకు వచ్చింది. అయితే, అక్కడకు రాగానే పులి కూనలు నీళ్లను చూసి ముచ్చటపడి.. అందులో దూకి సరదాగా గంతులు వేస్తూ ఆటలు మొదలు పెట్టాయి. ఎండ వేడిమి నుంచి సేదతీరుతూ గంటల తరబడి ఆ కూనలు.. నీటి గుంటలో సేదతీరుతూ ఆడుకుంటూ ఉన్నాయి. ఈ టైంలో ఒకవైపు తన పిల్లల అల్లరి చేష్టలను చూసి ఆనందిస్తూనే.. మరోవైపు వాటికి రక్షణగా గట్టుపైనే కూర్చుని కాపలా కాస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. తల్లి, తన పిల్లల రక్షణ విషయంలో కనీసం కనురెప్ప కూడా వేయదు అని కామెంట్ చేశారు. అలాగే ఏనుగులకు సంబంధించిన మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు . ఇందులో ఓ ఏనుగుల జంట తమ గున్న ఏనుగును ఓ నీటి ప్రవాహం వద్దకు తీసుకొచ్చాయి. అవి నీళ్లు తాగుతూ.. ఆ చిన్ని ఏనుగును కూడా తాగమని సూచించాయి. అయితే ఆ గున్న ఏనుగు నీటిని చూడగానే ఆనందంగా నీళ్లలోకి దూకి ఆడుకోవడం మొదలుపెట్టింది. దాంతో ఆ ఏనుగుల జంట తమ చిట్టి ఏనుగుకు ఆపద రాకుండా గట్టుపైన కాపలా కాస్తూ రక్షణగా నిలిచాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా… నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం:
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో
పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్ వీడియో
కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో