కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు

|

Aug 22, 2024 | 9:23 PM

అతనో స్వీపర్.. రోజూ ఊళ్లోని చెత్తను ఉడ్చే పని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కోటీశ్వరుడు. అయితే అతని ఇంట్లో మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లున్నాయి. ఎలా కొన్నాడా అనుకుంటున్నారా..? ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్‌ జైస్వాల్‌ మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో స్వీపర్‌గా పదోన్నతి పొందాడు.

అతనో స్వీపర్.. రోజూ ఊళ్లోని చెత్తను ఉడ్చే పని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కోటీశ్వరుడు. అయితే అతని ఇంట్లో మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లున్నాయి. ఎలా కొన్నాడా అనుకుంటున్నారా..? ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్‌ జైస్వాల్‌ మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో స్వీపర్‌గా పదోన్నతి పొందాడు. ఈ క్రమంలో ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి రూ.కోట్లలో ఆస్తులను సంపాదించాడు. ఫైళ్ల విషయం బయటపడి కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. సంతోష్‌ గుట్టు రట్టవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసి, పోలీస్‌ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సంతోష్‌ ఆస్తులు పరిశీలించిన అధికారులు నోరెళ్లబెట్టారు. అతడి వద్ద 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలింది. ఈ వాహనాలు సంతోష్‌ సోదరుడు, భార్య పేరు మీద ఉన్నట్లు అసిస్టెంట్‌ డివిజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి నివేదిక ఇచ్చారు. సంతోష్‌ బ్యాంకు ఖాతా వివరాలు కూడా పరిశీలిస్తున్న అధికారులు అతడిపై కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు