పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు

Updated on: Mar 11, 2025 | 4:08 PM

కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వరుడికి పెళ్లయిన రెండో రోజే ఊహించని షాకిచ్చింది వధువు. దాంతో తాను మోసపోయానని లబోదిబోమన్నాడు నవవరుడు. అత్తారింట అడుగుపెట్టిన రెండో రోజే ఓ బిడ్డకు జన్మనిచ్చి వరుడి కుటుంబానికి షాక్ ఇచ్చింది నవ వధువు. కాళ్ల పారాణి ఆరకమునుపే ఒక బిడ్డకు జన్మనివ్వడం వరుడి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఫిబ్రవరి 24వ తేదీన ఓ జంటకు ఎంతో వేడుకగా వివాహం జరిగింది. మరుసటి రోజే నవ వధువు అత్తారింట అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం వరుడి కుటుంబ సభ్యులందరికీ నవ వధువు టీ కూడా కాచి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే వరుడు, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువతికి పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డెలివరీ చేసిన వైద్య సిబ్బంది బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. దీంతో ఖంగుతిన్న నవ వరుడు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్