మూడేళ్లుగా కోమాలో.. ఆ సమయంలో ఒక్కసారిగా లేచిన మహిళ వీడియో

Updated on: Aug 12, 2025 | 2:15 PM

దాదాపు మూడేళ్లుగా కోమాలో ఉన్న ఓ మహిళ ఆర్గాన్ డోనేషన్ సర్జరీ జరుగుతున్న సమయంలో డాక్టర్లకు షాకిచ్చింది. ఏం జరిగిందంటే.. న్యూమెక్సికోకు చెందిన 38 ఏళ్ల డానెల్లా 2022లో కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి కోమాలోనే ఉంది. దీంతో డాక్టర్లు ఆమె మామూలు మనిషి అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆర్గన్ డొనేషన్ సర్వీస్.. డానెల్లా అవయవాలు డొనేట్ చేయాలని కుటుంబసభ్యులను కోరారు. కొద్దిరోజుల క్రితం ఆర్గన్ డొనేషన్‌కు కుటుంబం అయిష్టంగానే ఒప్పుకున్నారు.

డాక్టర్లు సర్జరీ చేస్తున్న సమయంలో డానెల్లా టక్కున కళ్లు తెరిచింది. డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సర్జరీ ఆపేశారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. వారు ఎంతో సంతోషించారు. అయితే, డానెల్లా కంటిలో గాటు పడి ఉండటం కుటుంబసభ్యులు గమనించారు. దీనిపై డాక్టర్లతో గొడవపెట్టుకున్నారు. అది కత్తిగాటు కాదని, తడి కారణంగా రిఫ్లెక్షన్ అయి అలా కనిపిస్తోందని డాక్టర్లు వారికి సర్దిచెప్పారు. డానెల్లా సోదరి ఆర్గాన్ డొనేషన్ సర్వీస్, డాక్టర్లపై దారుణమైన కామెంట్లు చేసింది. డానెల్లాను సర్జరీకి తీసుకుపోతున్నపుడు ఆమె చేతిని పట్టుకోగా ఆమెలో తనకు కదలిక కనిపించిందనీ డాక్టర్లకు ఈ విషయం తెలిసినా ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ వాళ్ల ఒత్తిడితో ఆపరేషన్‌కు సిద్ధమయ్యారని అంది. డాక్టర్లు ఈ ఆరోపణల్ని ఖండించారు. డానెల్లాకు సర్జరీ జరగకుండా ఆపింది ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ సభ్యులే అన్నారు. మొత్తానికి డానెల్లా మృత్యువు నుంచి తప్పించుకుని బయటపడింది.

మరిన్ని వీడియోల కోసం :

ఆగస్టులో వినాశనం.. బాబా వంగా జోస్యం నిజం కానుందా? వీడియో

నా జీవితాన్ని నాశనం చేశాడు..పుతిన్‌ పై రహస్య కుమార్తె కామెంట్‌

భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!