చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్

|

Aug 07, 2022 | 6:27 PM

యూపీలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఇంకా మనుషులను ఎంత దిగజారేలా చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు.

యూపీలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఇంకా మనుషులను ఎంత దిగజారేలా చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు. షాజహాన్‌పూర్ జిల్లా పిప్రౌలి గ్రామంలో కుబేర్ గంగ్వార్ సోమవారం సాయంత్రం అనారోగ్య కారణాలతో మరణించాడు. మంగళవారం మధ్యాహ్నం అతని అంత్యక్రియలు నిర్వహించారు కటుంబ సభ్యులు. చితికి నిప్పు పెట్టిన అనంతరం శ్మశానవాటిక నుంచి అందరూ తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచి మాటు వేసి ఉన్నాడో తెలియదు కానీ.. ఓ వ్యక్తి స్మశానికి చేరకున్నాడు. చితిలో నుండి మృతుడి తలను తొలగించి.. ఇంటికి తీసుకు వెళ్లాడు. తెల్లారి.. చిన్న కర్మ చేసేందుకు కుటుంబ సభ్యులు స్మశానానికి వెళ్లగా.. కపాలం కనిపించలేదు. మొదట ఏవైనా జంతువులు తీసుకువెళ్లాయేమో అని అనుమానపడ్డారు. కానీ చితికి నిప్పు ఉండటంతో.. అలాంటి చాన్స్ ఉండదని నిర్ధారణకు వచ్చారు. అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. విచారించగా స్టనింగ్ నిజం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఉపేంద్ర మద్యం మత్తులో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి కుబేర్ గంగ్వార్ తలను ఇంటికి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన స్టైలే వేరప్ప.. కిందపడ్డా.. లేచి డ్యాన్స్.. బుడ్డొడి కాన్ఫిడెన్స్‏కు నెటిజన్లు ఫిదా

Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’

స్టైల్‌గా బైక్‌ టర్న్‌ చేయాలనుకున్నాడు !! కానీ సీన్‌ కట్‌ చేస్తే !!

Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమలో పడతా..’ ఓపెన్‌గా చెప్పిన నాగచైతన్య

Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..

 

Published on: Aug 07, 2022 06:27 PM