పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ప్రస్తుతం లక్షలు ఖర్చు చేసి వివాహాలు ఆడంబరంగా చేస్తున్నారు. అతిథుల జాబితాను వీఐపీలకే పరిమితం చేస్తున్న వారూ లేకపోలేదు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి హృదయాలను గెలుచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఓ సోదరుడు తన సోదరి వివాహంలో ఎవరు ఊహించని విధంగా వ్యవహరించాడు. ఘాజీపూర్‌కు చెందిన సిద్ధార్థ రాయ్ తన సోదరి వివాహాన్ని కేవలం కుటుంబ ఆచారంగా కాకుండా మానవత్వానికి ఉదాహరణగా మార్చాడు. ఆ వివాహానికి ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖులను ఆహ్వానించలేదు. నగరంలోని నిరాశ్రయులను, యాచకులను పెళ్లికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు .
వైరల్ వీడియోలో, బిచ్చగాళ్ళు, నిరాశ్రయులైన అతిథులను పూర్తి గౌరవంతో ప్రత్యేక వాహనాలలో వివాహ వేదికకు తీసుకువచ్చాడు. వీఐపీలు, బంధువుల కోసం తయారుచేసిన వంటకాలనే ఆ ప్రత్యేక అతిథులకు కూడా వడ్డించాడు. సిద్ధార్థ్, అతని కుటుంబం వారికి తినిపించడమే కాకుండా, సంగీతం, డాన్స్‌లో కూడా వారు ఉత్సాహంగా పాల్గొనేలా చూసారు. వీడ్కోలు సమయంలో ప్రత్యేక అతిథులను ఖాళీ చేతులతో పంపలేదు; బదులుగా వారికి గౌరవంగా బహుమతులు ఇచ్చాడు. ఎవరూ లేని వారి ఆశీర్వాదాలు గొప్పవని తను నమ్ముతున్నట్లు సిద్ధార్థ్ వీడియోలో చెప్పాడు. వివాహనికి హాజరైన ఒక వృద్ధుడు తన జీవితంలో మొదటిసారిగా ఒక వివాహంలో ఇంత గౌరవం పొందినట్లు చెప్పారు. ఆత్మగౌరవం కోల్పోయిన భావన తొలగిపోయిందన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో
భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో