గోల్డ్‌ షాప్‌లో నెక్లెస్‌ కొట్టేసిన జంట

Updated on: Oct 03, 2025 | 5:45 PM

ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌షహర్‌ లో షాకింగ్‌ ఘటన జరిగింది. గోల్డ్‌ షాప్‌ కు వెళ్లిన ఓ జంట అక్కడ చేతివాటం ప్రదర్శించింది. ఆభరణాలు చూసే సమయంలో యజమాని కళ్లుగప్పి రూ. లక్షల విలువైన నెక్లెస్‌ ను దోచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఓ జంట స్థానికంగా ఉన్న బంగారం దుకాణానికి వెళ్లింది.

అక్కడ కొన్ని ఆభరణాలను చూస్తున్న సమయంలో ఓ నెక్లెస్‌ను మహిళ ఎవరికీ అనుమానం రాకుండా తన చీర కొంగు కింది భాగంలో దాచేసింది. అనంతరం షాపింగ్‌ ముగించుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, స్టాక్‌ తనిఖీల సమయంలో ఆరు గ్రాముల బంగారం తగ్గినట్లు యజమాని గుర్తించాడు. దీంతో దుకాణం యజమాని గౌరవ్‌ పండిట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన నెక్లెస్‌ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అందులో ఓ మహిళ నెక్లెస్‌ దోచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. వారి కోసం గాలింపు చేపట్టారు. వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య

సంక్రాంతి ఫైట్‌.. ఫైనల్‌ లిస్ట్‌లో ఆ నలుగురు