Undressed Women: 5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా.?

Undressed Women: 5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Sep 30, 2024 | 10:52 AM

స్త్రీ, పురుషులు వివాహ బంధంతో ఒక్కటవుతారని మనకు తెలుసు. పెళ్లి అనేది అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పూజాపద్ధతుల ప్రకారం నిర్వహిస్తారు. పెళ్లైన దంపతులు ఆ తర్వాత తమ కుటుంబాల్లో వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివాహానంతరం విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని గిరిజన తెగల్లోనైతే వింత ఆచారాలను చూస్తాం. కొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది.

స్త్రీ, పురుషులు వివాహ బంధంతో ఒక్కటవుతారని మనకు తెలుసు. పెళ్లి అనేది అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పూజాపద్ధతుల ప్రకారం నిర్వహిస్తారు. పెళ్లైన దంపతులు ఆ తర్వాత తమ కుటుంబాల్లో వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివాహానంతరం విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని గిరిజన తెగల్లోనైతే వింత ఆచారాలను చూస్తాం. కొన్ని చోట్ల వధూవరులను వేర్వేరు గదుల్లో ఉంచే ఆచారం ఉంది. అయితే ఇప్పుడు వీటన్నిటిని మించి అన్నట్లు పూర్తిగా భిన్నమైన ఓ ఆచారం గురించి తెలుసుకుందాం.

హిమాచల్ ప్రదేశ్‌ మణికర్ణ లోయలోని పిని గ్రామ ప్రజలు వివాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ పెళ్లి చేసుకున్న మహిళలు సంవత్సరంలో 5 రోజులు ఎలాంటి దుస్తులూ ధరించరు. భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు గానీ.. ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇద్దరూ ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు. ఈ 5 రోజులు ఆడవాళ్లు మగవాళ్ల ముందుకి రారు, ఇంటి తలుపులు వేసుకోరు. నవ్వరు కూడా. ఇంటి పని నుంచి ప్రతి పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు. ఇలా చేయకపోతే వారికే కాదు.. గ్రామానికి కూడా అరిష్టమని, కీడు జరుగుతుందని నమ్ముతారు. ఇదొక్కటే కాదు.. పురుషులు కూడా ఈ సమయంలో మద్యం సేవించరు. మహిళలతో అస్సలు మాట్లాడరు, చూసి నవ్వుకోరు, ఆ ఐదు రోజులు మాంసం తినడం కూడా మానేస్తారు.

ఇంతకీ ఈ ఆచారం ఎందుకంటే.. పూర్వం పిని గ్రామంలోకి ఓ రాక్షసుడు వచ్చి చక్కగా బట్టలు వేసుకున్న పెళ్లైన స్త్రీలను తీసుకెళ్లేవాడట. అందమైన బట్టలు వేసుకున్న ఏ స్త్రీనైనా తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెట్టేవాడట. చివరికి లాహు ఘోండ్ దేవత రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించిందట. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ దేవత రాక్షసుడిని వధించిన సందర్భాన్ని ఈ గ్రామప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ సంప్రదాయంలో కాలక్రేమణా కొంచెం మార్పు వచ్చి.. ఆ 5 రోజులు మహిళలు సన్నని ఉన్ని దుస్తులు ధరించడం మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.