Loan App Harassment: మరీ ఇంత వేధింపులా.. చస్తే చావండి.. లోన్‌ కట్టేసి చావండి.. వేధింపులకు మరో ప్రాణం బలి..

|

Sep 24, 2022 | 9:40 AM

చస్తారా? అయితే చావండి. కానీ, లోన్‌ కట్టేసి చావండి అంటున్నాయి లోన్‌ యాప్స్‌. వేధింపులు భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకుంటే, శవం తీయకముందే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వేధింపులకు దిగారు నిర్వాహకులు.


చస్తారా? అయితే చావండి. కానీ, లోన్‌ కట్టేసి చావండి అంటున్నాయి లోన్‌ యాప్స్‌. వేధింపులు భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకుంటే, శవం తీయకముందే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వేధింపులకు దిగారు నిర్వాహకులు. లోన్‌ యాప్స్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది. లోన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక నంద్యాలలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. బాలాజీ కాంప్లెక్స్‌ ప్రాంతానికి చెందిన మల్లికార్జున, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు ఎం.రవీంద్రనాథ్‌ ప్రస్తుతం బెంగళూరులో బీటెక్‌ చదువుతున్నాడు. 20 రోజుల కిందట నంద్యాలకు వచ్చిన రవీంద్రనాథ్.. బీటెక్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫైలవ్వడంతో ముభావంగా ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. అయితే, అతని సోదరుడి సెల్‌ఫోన్‌కు లోన్ యాప్‌ నిర్వాహకుల నుంచి మార్ఫింగ్‌ చేసిన రవీంద్రనాథ్‌ ఫొటో వచ్చింది. ‘అతను మా వద్ద రుణం తీసుకుని చెల్లించలేదు. రెఫరెన్స్‌ కోసం మీ ఫోన్‌ నంబరు ఇచ్చాడు. రుణం చెల్లించకుంటే పోలీసులు మిమ్మల్నీ అరెస్టు చేస్తారు’ అని అందులో హెచ్చరించారు. దీంతో తల్లిదండ్రులు నిలదీయడంతో గదిలోకి వెళ్లిన రవీంద్రనాథ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

 

Published on: Sep 24, 2022 09:40 AM