Shop Owner: అమానుష ఘటన.. తినుబండారాల కోసం వెళ్లిన విద్యార్థులకు షాప్ ఓనర్ షాక్..!
తమిళనాడులో అమానుష ఘటన వెలుగుచూసింది. తినుబండారాలు కొనడానికి షాప్‌కి వెళ్లిన చిన్నారులను కులం పేరుతో అవమానించాడు షాపు ఓనర్. ఇందుకు సంబంధించిన వీడియో..
తమిళనాడులో అమానుష ఘటన వెలుగుచూసింది. తినుబండారాలు కొనడానికి షాప్‌కి వెళ్లిన చిన్నారులను కులం పేరుతో అవమానించాడు షాపు ఓనర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేంకాసి జిల్లా సంకరణకోవిల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తమిళనాట పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. స్కూల్‌కి వెళ్లే ముందు ఆకలిగా ఉందని కొందరు చిన్నారులు దుకాణానికి వెళ్లారు. తినడానికి ఏమైనా ఇవ్వాలని అడిడిన వారికి ఏమీ ఇవ్వలేదు. పైగా దళితులకు ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ ముఖం మీదే చెప్పాడు షాపు ఓనర్. తక్కువ కులం వారికి అమ్మకూడదని పంచాయితీలో నిర్ణయించినట్లు చిన్నారులకు చెప్పి పంపించాడు. దాంతో ఆ చిన్నారులు షాపు వద్ద నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

