భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్‌ చేసుకుంటున్నాడు

|

Jun 30, 2022 | 9:22 AM

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు దేశాలప్రజలపైనే కాదు.. ప్రపంచ దేశాల ప్రజల జీవనంపై కూడా పడిందని చెప్పవచ్చు.

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు దేశాలప్రజలపైనే కాదు.. ప్రపంచ దేశాల ప్రజల జీవనంపై కూడా పడిందని చెప్పవచ్చు. ఈ యుద్ధం.. ఉక్రేనియన్ల జీవితాన్ని ఒక పీడకలగా మార్చింది. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది మరణించారు. మిలియన్ల కొద్ది ఉక్రెయిన్ దేశం విడిచి పెట్టి వెళ్లిపోయారు. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అవి అక్కడ ప్రజల జీవన విధానంపై యుద్ధ ప్రభావం ఏవిధంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఉక్రేనియన్‌ ఇంటిపైన రష్యన్ రాకెట్ శకలం వచ్చి పడింది. అయినప్పటికీ అతను ఏమాత్రం చలించకుండా.. అదంతా కామనే.. అన్నట్టుగా అద్దం ముందు నిల్చొని తాపీగా షేవింగ్ చేసుకుంటున్నాడు. ఆ వీడియోలో ఉక్రేనియన్ వ్యక్తి తన వంటగది సీలింగ్‌ నుంచి రాకెట్ శకలం తన ఇంటిలోపలికి దూసుకొచ్చిన రంధ్రం చూపించాడు. అక్కడ రాకెట్‌ ముక్క అతని కుడివైపు సీలింగ్‌కి వేలాడుతూ కనిపిస్తుంది. అయినా అతను చాలా క్యాజువల్‌గా సింక్ దగ్గర షేవింగ్ చేస్తూ కనిపించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది

తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!

 

Published on: Jun 30, 2022 09:22 AM