భార్య కంట్లో పడ్డ భర్త నిర్వాకం.. ఏం చేశాడో తెలుసా ??

|

Jun 19, 2024 | 11:18 PM

ఇంగ్లాండ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పై.. ఆయన భార్య విడాకుల దావా వేసింది. దీనివల్ల తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టపోతానని భావించిన సదరు భర్త... అసలు దీనికంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు. భార్య విడాకులు కోరితే భర్త యాపిల్ కంపెనీపై దావా వేయడమేంటని అనుకుంటున్నారు కదా.. విషయమేంటంటే..

ఇంగ్లాండ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పై.. ఆయన భార్య విడాకుల దావా వేసింది. దీనివల్ల తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టపోతానని భావించిన సదరు భర్త… అసలు దీనికంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు. భార్య విడాకులు కోరితే భర్త యాపిల్ కంపెనీపై దావా వేయడమేంటని అనుకుంటున్నారు కదా.. విషయమేంటంటే.. ఇంగ్లాండ్ వ్యాపారవేత్త తన ఇంట్లోని ఐమ్యాక్ తో ఓ సెక్స్ వర్కర్ తో ఛాటింగ్ చేశాడు. పనయ్యాక ఆ మెసేజ్ లు అన్నీ డిలీట్ చేశాడు. తన ఘనకార్యం ఎవరూ చూడరులే, ముఖ్యంగా తన భార్యకు తెలిసే అవకాశం అస్సలు లేదని నిశ్చింతగా ఉన్నాడు. అయితే, యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో ఐమెసేజెస్ కు ఓ సౌలభ్యం ఉంది. ఒకే యాపిల్ ఐడీతో ఉపయోగిస్తున్న ఐఫోన్, ఐమాక్ లలో ఏదైనా ఒక ఫోన్ లేదా మ్యాక్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు మరో ఫోన్ లేదా మ్యాక్ లో చూడొచ్చు. సింక్రనైజేషన్ ప్రక్రియ వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇది తెలియక సదరు భర్త నిశ్చింతగా ఉన్నాడు పాపం. అయితే భర్త నిర్వాకాన్ని తన ఫోన్ లో చూడనే చూసింది భార్య. అతని తీరుపై మండిపడింది. అంతేకాదు, విడాకులు కావాలంటూ కోర్టులో దావా వేసి, ఈ మెసేజ్ లను సాక్ష్యంగా అందజేసింది. విడాకులు మంజూరైతే భరణం కింద 5 మిలియన్ డాలర్లు భార్యకు చెల్లించాల్సి వస్తుందని, ఇటు భార్య దూరమై అటు ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఎదురైందని భర్త లబోదిబోమన్నాడు. దీనంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనని ఆరోపించాడు. ఐమెసేజ్ లు డిలీట్ చేసినపుడు ‘యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్’ అని సందేశం వచ్చిందని, దాంతో తాను ఎంతో భరోసాగా ఉన్నానని చెప్పాడు. అలా కాకుండా ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్’ అనో లేక ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్ ఓన్లీ’ అనో సందేశం కనిపిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని నెత్తి బాదుకున్నాడు. సెక్స్ వర్కర్ తో తన చాటింగ్ విషయాన్ని తన భార్య మూడ్ బాగున్నపుడు తానే చెప్పేవాడినని తెలిపాడు. అయినా సరే తమ మధ్య గొడవ మాత్రమే జరిగేదని, పరిస్థితి విడాకుల వరకూ మాత్రం వచ్చేది కాదన్నాడు. తన ద్వారా తెలియాల్సిన విషయం యాపిల్ కంపెనీ నిర్వాకం వల్ల తెలిసేసరికి తన భార్య బాగా హర్టయిందని చెప్పాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత యాపిల్ కంపెనీదేనని స్పష్టం చేశాడు. తనలాంటి పరిస్థితి ఎదుర్కొన్న యాపిల్ వినియోగదారులు కూడా ముందుకు వచ్చి న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌.. రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్‌

వందే భారత్ స్లీపర్​ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు

డీజే సిద్ధార్థ్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌.. ఎవరీ సిద్దార్థ్‌ ??

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా

ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్‌