Tirumala: శ్రీవారి సన్నిధిలో రెండు భారీ సర్పాలు ప్రత్యక్షం.. భయంతో భక్తులు ఎం చేసారంటే..?

|

May 01, 2023 | 9:21 AM

తిరుమలలో రెండు పాములు హల్‌చల్ చేశాయి. నడకమార్గంలో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షం కావటంతో.. భక్తులు కంగారుపడిపోయారు. గాలిగోపురం వద్ద ఈ ఘటన జరిగింది. భయాందోళనకు గురైన భక్తులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

తిరుమలలో రెండు పాములు హల్‌చల్ చేశాయి. నడకమార్గంలో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షం కావటంతో.. భక్తులు కంగారుపడిపోయారు. గాలిగోపురం వద్ద ఈ ఘటన జరిగింది. భయాందోళనకు గురైన భక్తులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు… పాములను చాకచక్యంగా బంధించారు. మరోవైపు తిరుమలలోని ఫిల్టర్ హౌస్ వద్ద కూడా ఓ పాము ప్రత్యక్షమైంది. సుమారు ఏడు అడుగుల పొడవు ఉండే పాము కనిపించడంతో టీటీడీ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే భాస్కర్ నాయుడుకు సమాచార ఇచ్చారు, సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడు చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును బంధించారు. ఇది జరిగిన గంటలోనే గాలిగోపురం వద్ద నాగుపాము ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. నాగుపామును కూడా బంధించి.. రెండు పాములను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.వేసవి కాలంలో కావటంతో ఉక్కపోత కారణంగా పాములు జనావాసాల్లోకి వస్తుంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ సూచించారు. కనిపించిన వెంటనే వాటిపై దాడి చేయకుండా సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Follow us on