Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది

|

Aug 01, 2023 | 9:10 PM

మణిపూర్ అల్లర్ల పై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. గడచిన రెండున్నర నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల పై చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిందే అని ఇండియా కూటమి, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం చర్చకు అనుమతివ్వటంలేదు. మరోవైపు గందరగోళం మధ్యనే ప్రధాన బిల్లులను ఆమోదం కోసం ప్రభుత్వం సభ ముందుంచింది.

మణిపూర్ అల్లర్ల పై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. గడచిన రెండున్నర నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల పై చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిందే అని ఇండియా కూటమి, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం చర్చకు అనుమతివ్వటంలేదు. మరోవైపు గందరగోళం మధ్యనే ప్రధాన బిల్లులను ఆమోదం కోసం ప్రభుత్వం సభ ముందుంచింది. మణిపూర్‌ హింసపై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు కాసేపు కొనసాగాయి. ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు సరిగా జరగకపోవటానికి కారణాలు నువ్వంటే కాదు నువ్వే అని రెండువైపుల ఎంపీలు ఆరోపణలు చేసుకుంటున్నారు. వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుంచింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో రూపొందించిన ‘ ది గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటొరీ ఆఫ్‌ ఢిల్లీ- 2023’ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓవైపు మణిపూర్‌ అంశంలో ఉభయసభల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని లోక్‌సభకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు అమిత్ షా. మరో వైపు ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో కొట్టుకుపోతున్న ఆవు.. ఆ ముస్లిం యువకుడు చేసిన పనికి !!

గాడిదకు బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎందుకు చేశారో తెలుసా ??

Vijayawada: జయవాడలో అందుబాటులోకి ట్రైన్ కోచ్ హోటల్

సముద్రపు ఒడ్డున షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే ??

యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా ??

Follow us on