Tungabhadra: తగ్గాననుకున్నారా లే.. మళ్లీ పెరిగినా.! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల..

|

Aug 04, 2024 | 11:02 PM

కృష్ణా నది మీద నాగార్జున సాగర్‌ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు బార్లా తెరుచుకున్నాయి. జూరాల ప్రాజెక్ట్‌కు.. 3 లక్షల 25వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 42 గేట్లు ఎత్తి 3 లక్షల 9వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన తుంగభద్ర, కృష్ణా నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 4 లక్షల 65వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది.

కృష్ణా నది మీద నాగార్జున సాగర్‌ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు బార్లా తెరుచుకున్నాయి. జూరాల ప్రాజెక్ట్‌కు.. 3 లక్షల 25వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 42 గేట్లు ఎత్తి 3 లక్షల 9వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన తుంగభద్ర, కృష్ణా నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 4 లక్షల 65వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది. 10 గేట్లు ఎత్తి 4 లక్షల 91వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 208 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు 4 లక్షల 91వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది.

30 వేల 886 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 305 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 50 క్యూసెక్కులు మాత్రమే కిందకు వదులుతున్నారు.. ప్రాజెక్ట్.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక తగ్గిపోయిందనుకున్న తుంగభద్ర జలాశయానికి వరద మళ్ళీ పెరుగుతోంది. ప్రాజెక్ట్‌కు 1 లక్షా 97 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 33 గేట్లు ఎత్తి 1 లక్షా 79వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం.. 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 98 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on