తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
తిరుమల జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో నుంచి నీరు పాలలా తెల్లగా రావడంతో భక్తుల్లో చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన టీటీడీ, పంపుల అధిక ఒత్తిడి వల్ల ఏర్పడిన సూక్ష్మ గాలి బుడగల కారణంగానే నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని తెలిపింది. ప్రయోగశాల పరీక్షల్లో నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉందని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సందర్శించే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో నుంచి నీరు పాలులా తెల్లగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధవళ వర్ణంలో వస్తున్న ఈ నీటిని పట్టుకుని భక్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇది స్వామివారి మహత్యమా లేక మరేదైనా కారణమా అని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం తక్షణమే స్పందించి అపోహలను తొలగించింది.నీటి పంపులలోని అధిక ప్రెజర్ వల్ల నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడి, తాత్కాలికంగా నీరు అలా తెల్లగా కనిపిస్తోందని స్పష్టం చేసింది. కుళాయి నుంచి పట్టుకున్న కొన్ని సెకన్లలోనే ఆ నీరు తిరిగి సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతుందని వివరించింది. అంతేకాకుండా, టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్‌లో ఆ నీటి నమూనాలను పరీక్షించగా, నీరు లభించినంత స్వచ్ఛంగా ఉందని, ఎటువంటి మలినాలు లేదా దుర్వాసన లేవని అధికారులు తేల్చారు. కాబట్టి భక్తులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎలాంటి అపోహలకు లోనుకావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
