Sabarimala: స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం.. శబరిమల భక్తులకు ఊరట.! వీడియో..
శబరిమల ఆలయాన్ని దర్శించే భక్తుల కోసం వర్చువల్ క్యూ లైన్ స్లాట్‌ల సంఖ్యను పెంచకూడదని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. దీనికి బదులుగా, ముందస్తు రిజర్వేషన్ లేకుండా ఆలయానికి వచ్చేవారికి స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తోంది. వర్చువల్ క్యూ స్లాట్‌లు బుక్ చేసుకున్న దాదాపు 12,500 నుంచి 15,000 మంది భక్తులు దర్శనానికి రాకపోవడాన్ని గమనించిన దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
శబరిమల యాత్రికుల రద్దీ పెరిగి రోజుకు 90 వేలకు చేరుకున్నట్లయితే పదునెట్టాంబడి నుంచి మరక్కూట్టం వరకు క్యూ లైన్ స్లాట్‌ను విస్తరిస్తామని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులను పంపాలోనే అడ్డుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్‌లో మొదటి 14 రోజుల్లో 11.18 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారని దేవస్వం బోర్డు తెలిపింది. మొదటి 12 రోజులు 9.13 లక్షల మంది భక్తులు వచ్చారనీ ఇది గత ఏడాది కంటే 3.59 లక్షలు ఎక్కువని ప్రకటించింది. అలాగే నవంబర్ 28న అత్యధిక సంఖ్యలో 87,999 మంది ఆలయాన్ని దర్శించారీ అందులో 15,514 మంది స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చినట్లు పేర్కొంది.
గతేడాది డిసెంబర్లో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. స్పాట్ బుకింగ్ రద్దు చేసిన దేవస్వం బోర్డు భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్పాట్ బుకింగ్ రద్దును పునఃపరిశీలించారని విపక్షాలు కోరాయి. ఆన్లైన్ బుకింగ్‌పై ప్రత్యేకంగా ఆధారపడటం వల్ల యాత్రికులు, ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, సాంకేతికత గురించి తెలియని వారు తీవ్ర ఇబ్బందులు పడతారని బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.