కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..

Updated on: Jan 13, 2026 | 3:42 PM

దేశరక్షణకోసం సరిహద్దుల్లో అహర్నిశలూ కాపలా కాస్తూ దేశ ప్రజలకు రక్షణగా నిలిచిన ఓ సైనికుడు తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తడమే అంటారు. అలాంటి కష్టసమయంలో భార్యకు తోడుగా ఉండాలని ఎంతో ఆశతో బయలు దేరాడు.

మరి కొన్ని గంటల్లో తండ్రిగా ప్రమోషన్‌ తీసుకోనుండగా విధి వక్రించింది. ప్రమాద రూపంలో అతని ప్రాణాలు బలితీసుకుంది. కన్నబిడ్డను చూసుకోకుండానే కాలగర్భంలో కలిసిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది.సతారాలోని పర్లీకి చెందిన ప్రమోద్‌ జాదవ్‌ సైన్యంలో సేవలందిస్తున్నారు. ఏడాది క్రితమే వివాహమైంది. భార్య గర్భిణీ. డెలివరీ కోసం ఆమెను ఇటీవల స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పితృత్వ సెలవులపై స్వస్థలానికి వచ్చిన ప్రమోద్‌.. జనవరి 9, శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గంటలకే ఆయన సతీమణి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చూడకముందే తండ్రి కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమోద్‌ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. భర్త కడచూపు కోసం ప్రమోద్‌ భార్యను, శిశువును ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. ఆ హృదయవిదారక సన్నివేశం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం