సింహాల డెన్‌లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్‌

Updated on: Dec 10, 2025 | 1:54 PM

బ్రెజిల్‌లో ఓ హృదయ విదారక ఘటనలో, 19 ఏళ్ల యువకుడు సింహాన్ని దగ్గరగా చూడాలనుకొని జూ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోయాడు. సింహానికి కేర్‌టేకర్‌ కావాలనే అతని కల ప్రాణాంతకంగా మారింది. జూ సిబ్బంది, సందర్శకులు హెచ్చరించినా వినకుండా, భద్రతా నియమాలను ఉల్లంఘించాడు. ఈ ఘటన జూ భద్రతా ప్రమాణాలపై ఆందోళన రేకెత్తించింది.

బ్రెజిల్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన బ్రెజిల్‌లోని జావో పెస్సావా ప్రాంతంలోని అరుడా కామరా జూ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సింహాలకు కేర్‌టేకర్‌గా మారాలన్నది 19 ఏళ్ల మచాడో కల. సింహాలను మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. జూ విజిటర్స్‌ వారిస్తున్నా వినకుండా గోడపైకి ఎక్కాడు. సింహం డెన్‌ చుట్టూ ఉన్న 20 అడుగుల గోడపైకి ఎక్కి, సెక్యూరిటీ ఫెన్సింగ్‌ను దాటి అక్కడి నుంచి నేరుగా సింహం ఉండే బ్యారక్‌లోకి దిగాడు. దూరం నుంచి యువకుడి కదలికలను గమనించిన సింహం కొన్ని క్షణాల్లోనే అతడి వద్దకు పరిగెత్తింది. ఆ యువకుడు చెట్టు మీద ఉండగానే సింహం కిందకు లాగింది. కింద పడిన యువకుడిని పొదలవైపు లాక్కెళ్లింది. జూ సిబ్బంది స్పందించేలోపే అతడు సింహం చేతిలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను దూరంగా ఉన్న సందర్శకులు వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సందర్శకులు, స్థానికులు ఒక్కసారికి భయాందోళన చెందారు. జూలో “భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు అసలు చేయకూడదు అని హెచ్చరించారు. మచాడో కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అతని కుటుంబం తెలిపింది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. గతంలో ఎవరి పైనా దాడికి పాల్పడిన చరిత్ర సింహానికి లేదని ఈ ఉదంతంలో సింహం తీవ్ర ఒత్తిడికి గురైనట్లు జూ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం

డ్రైవర్ కు ఫిట్స్‌ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..

ఆధార్‌పై కీలక అప్‌డేట్‌.. దాని కోసం QR కోడ్ తప్పని సరి

Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్‌ స్లీపర్ రైలు

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!